09-08-2025 12:11:48 AM
ఖమ్మం, ఆగస్ట్ 8 (విజయ క్రాంతి):బీసీ కులస్తులకు పాలకులు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వవలసిందే అని మున్నూరు కాపు సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు గుండాల కృష్ణ అన్నారు. మున్నూరు కాపు కులస్థుల సమావేశం శుక్ర వారం కృష్ణ నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపులు మిగతా బీసీ కులస్తులను కలుపుకొని 42 శాతం రిజర్వేషన్ సాధించేలా కృషి చేయాలన్నారు.
మిగతా కులాల సహకారం తో ఖమ్మం కార్పొరేషన్ మేయర్ స్థానమే లక్ష్యం గా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు. రాజకీయ పార్టీలు కూడా మున్నూరుకాపుల కు ఎన్నికల్లో సముచిత స్థానాలు కేటాయించాలని,అప్పుడే ఆయా పార్టీల కు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.దీనిపై కార్యాచరణ రూపొందించేందుకు త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం లో సంఘం నాయకులు కొత్తా సీతారాములు, మూలగుండ్ల శ్రీహరి, ఉప్పు మోహన్ రావు, చౌడవరపు వెంకటేశ్వర్లు, మెంతుల శ్రీశైలం,గీతా వెంకన్న,కనకం జనార్దన్, మాటేటి రామారావు కనకం భద్రయ్య, మాటేటి నాగేశ్వరరావు,యర్రా అప్పారావు తోట శేఖర్, కోయిల వీరభద్రం, బండి నవీన్ ,మాటేటి రవి, మాటేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు