09-08-2025 12:15:17 AM
- జవహర్ స్కీం ద్వారా సాగర్ జలాల విడుదల
- 630 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
- నెరవేరబోతున్న రైతు కలలు-10న శంకుస్థాపన
ఎర్రుపాలెం, ఆగస్టు 8 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని చివరి మండలాలు గా ఉన్న మధిర ఎరుపాలెం ఆంధ్ర ప్రదేశ్ కు సరిహద్దుగా ఉన్నాయి. ఈ ప్రాంత రైతుల ఆ యకట్టు భూముల కు వైరా నది జలాలు అందించే ఉద్దేశంతో వైరా నది పై వంగవీడు గ్రామం వద్ద 630 కోట్ల వ్యయంతో జవహ ర్ ఎత్తిపోతల స్కీం ను ఈనెల 10న ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మాత్యులు ఉత్తమ కుమార్ రెడ్డి, శంకుస్థాపన ,భూమి పూజ చేయనున్నారు.
మధిర , ఎర్రుపాలెం మండలాల రై తులకు నేటి వరకు మూడవ ఆయకట్టు ద్వా రా సాగర్ జలాలను రైతులకు విడుదల చేసేవారు. అయితే మూడవ ఆయకట్టు ద్వారా ఈ ప్రాంత రైతులకు సాగర్ జలాలు సరిగ్గా అందేవి కావు. దీనివలన ఈ ప్రాంత రైతులు ఎన్నో ఇబ్బందులకు గురై తమ పంటలను సరిగా పండించలేకపోతున్నారు. సరియైన నీటి వసతి లేక రైతులు పంటలు సాగు చే యలేకపోవడంతో రైతుల భూములు బీడు భూములుగా మారిపోయినవి.
రైతుల కష్టాలను నెరవేర్చడానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కృషితో మూడవ ఆయకట్టు నుండి రెండవ ఆయకట్టుకు సాగర్ జలాలను అందించే ఉద్దేశంతో జవహర్ ఎత్తిపో తల పథకాన్ని డిజైన్ చేశారు. దీనివల్ల ఎర్రుపాలెం మధిర మండలాల రైతుల కష్టాలు తీరిపోతున్నాయి. ఖమ్మం జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమకాలవ ద్వారా లక్ష ఎకరాల కు సాగునీరు అందించి రైతుల కలలను సా కారం చేయనున్నారు. మధిర ఎర్రుపాలెం ప్రాంత రైతులకు ఈ పథకం అమలులోకి వ స్తే దాదాపు 30 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది.
ఈ ప్రాంత రైతులు సాగర్ జలాలు తమకు సక్రమంగా అందడం లేదని ఎన్నో సంవత్సరాలుగా గత పాలకుల దృ ష్టికి తీసుకొచ్చినప్పటికీ ఫలితం లేకుండా పో యింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాంత రైతుల కష్టాలను గుర్తించి నాగార్జునసాగర్ నీటిని మూ డవ ఆయకట్టు నుంచి రెండవ ఆయకట్టుకు మార్చి సాగునీటిని అందించేందుకు ప్రభు త్వం సిద్ధమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పాలకులు రైతుల కష్టాలను గుర్తించకపోవడంతో రైతులు ప్రజా ప్ర భుత్వాన్ని ఎన్నుకోవడంతో ఈ ప్రాంత రైతు ల కష్టాలు తీరబోతున్నాయి. మధిర మండ లం వంగవీడు దగ్గర వైరా నదిపై చెక్ డ్యాము నిర్మాణం చేపట్టి ఆ నీటిని నాగార్జునసాగర్ కాలువల కు మళ్లించనున్నారు.
మోటార్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి మైలవరం బ్రాంచ్ కెనాల్ నరసింహపురం గ్రామం వద్ద నాగార్జునసాగర్ మెయిన్ కెనాల్ కు నీటిని పంపించనున్నారు. రెండవ లిఫ్ట్ ద్వారా ఎ ర్రుపాలెం మండలంలోని జమలాపురం మే జర్ గుంటుపల్లి గోపారం దగ్గర నాగార్జునసాగర్ కాలువలోకి నీటిని పంపింగ్ చేయను న్నారు. మూడో లిఫ్ట్ ద్వారా మధిర మండ లం నాగర్పాడు గ్రామం వద్ద సాగర్ కాలువ లోకి పంపింగ్ చేయనున్నారు.
రైతులకు ప్ర స్తుతం నిదానపురం, జమలాపురం, మూలపాడు సాగర్ కాలువల ద్వారా నీటిని అంది స్తున్నారు.అనుకున్న లక్ష్యం తొందరగా పూర్తయితే 30 వేల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనున్నది.రైతుల ఆశలు నెరవేరబోతున్నాయి.. మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు.ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కృషితో మధిర, ఎర్రుపాలెం మండలాల రైతుల భూములు ఈ ప్రాజెక్టు నిర్మాణంతో మూడవ ఆయకట్టు నుండి రెండో ఆయకట్టుకు మార్చడం వలన ఈ ప్రాంత రైతులు రెండు పంటలు పండించుకునేందుకు స మృద్ధిగా నీటిని ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.