28-01-2026 03:51:40 PM
భైంసా,(విజయక్రాంతి): ఉపాధ్యాయులకు సంకటంగా మారిన సిపిఎస్ (నూతన పెన్షన్ విధానం)ను పూర్తిగా రద్దు చేసేవరకు ఉపాధ్యాయ సంఘాల పోరాటం కొనసాగిస్తామని ఎస్టీయుటిఎస్ జిల్లా అధ్యక్షులు భూమున్న యాదవ్ అన్నారు. బుధవారం వివిధ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఓపిఎస్ (పాత పెన్షన్ విధానం)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ STUTS (AISTF) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
మహాధర్నాను ఉపాధ్యాయులంతా ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మాట్లాడుతూ... ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం ఈ పోరాటం తప్పనిసరి. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేలా ఉపాధ్యాయులంతా ఢిల్లీ బాట పట్టి చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని చరిత్రాత్మకంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.