28-01-2026 03:57:18 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలంలోని ముజుగి మల్లన్న జాతరకు పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఫిబ్రవరి 1 2 తేదీల్లో నిర్వహించే జాతరకు రావాలని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ఆలయ కమిటీ అధ్యక్షులు మల్లేష్ బుధవారం జిల్లా ఎస్పీ కలిసి విన్నవించారు. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నందున ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూలర్ ఎస్సై స్థానిక నాయకులు ఉన్నారు.