23-01-2026 09:15:32 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలు, జిల్లా వైద్య-ఆరోగ్య శాఖ అధికారి సూచనల మేరకు తంగళ్లపల్లి వైద్యాధికారి స్నేహ ఆధ్వర్యంలో టీబీ రోగులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్య సహకారంతో నేడు 24 మంది టీబీ పేషెంట్లకు న్యూట్రిషన్ కిట్లు అందజేశారు. రోగుల ఆరోగ్య పునరుద్ధరణకు పోషకాహారం కీలకమని వైద్యులు తెలిపారు.