అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
విజయ క్రాంతి ఎఫెక్ట్
పేకాట జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది
కామారెడ్డి జిల్లాలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
ఏడుగురు పేకాట రాయుళ్ల పట్టివేత
జిల్లాలో పేకాట స్థావరాలపై ప్రత్యేక నిఘా
పేకాట ఆడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర
కామారెడ్డి, మార్చి 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో పేకాట జోరు అనే కథనం విజయ క్రాంతి దినపత్రికలో ప్రచురితం కావడంతో పోలీసులు స్పందించారు. జిల్లాలో పేకాట ఆడే స్థావరాలను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలు జారీ చేయడంతో గురువారం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాదులో పోలీసులు పేకాట స్థానం పై దాడి చేసి ఏడుగురు పేకాటరాయిలను అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా గురువారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ పేకాట అనేది కేవలం ఒక వ్యసనం మాత్రమే కాదు, అని అది ఒక కుటుంబం యొక్క ఆర్థిక పునాదులను కూల్చే సామాజిక మహమ్మారి అని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. క్షణికానందం కోసం పేకాటకు బానిసలైతే, అప్పుల ఊబిలో కురుక పోతారన్నారు, చివరికి ఆత్మహత్యల వంటి దారుణమైన పరిణామాలకు దారితీస్తుందన్నారు. ప్రజలు, ముఖ్యంగా యువత పేకాట వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు.
చక్కటి సంసారాలు, కుటుంబాల లో పేకాట ద్వారా కొట్లాటలు పెరుగుతాయన్నారు. దీంతో భార్యాభర్తల మధ్య తల్లిదండ్రుల మధ్య గొడవలకు దారి తీసి ఆత్మహత్యల వరకు వస్తుందని ఇలాంటి వ్యసనాలకు యువత, ప్రజలు లోను కావొద్దు న్నారు. బాధ్యతాయుతమైన పౌరులుగా తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించే వారిపై పోలీసుల నిరంతరం నిఘా కొనసాగుతుందన్నారు, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు‘ అని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నస్రుల్లాబాద్ గ్రామంలో అక్రమంగా పేకాట నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు, ఎస్త్స్ర పి. రాఘవేంద్ర ఆధ్వర్యంలో పోలీస్ లు సిబ్బంది మెరుపు దాడి నిర్వహించారు.
ఈ దాడిలో జూదం ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 9,280 నగదుతో పాటు, ఏడు సెల్ ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు నిర్భయంగా ముందుకు వచ్చి సమాచారం అందించాలని పోలీస్ శాఖ కోరుతోంది. అక్రమ కార్యకలాపాల గురించి వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు లేదా డైల్ 100 కు ఫోన్ చేయాలని అన్నారు, సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.




