27 March, 2026 | 3:49 AM

అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు

27-03-2026 12:48 AM

--జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్, మార్చి 26(విజయక్రాంతి): జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశంలో జిల్లాలో ఇసు క అక్రమ తవ్వకాలు, రవాణా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణాచేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. గురువారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీవోలు తాసిల్దార్లు , మైనింగ్ ,ఇరిగేషన్, పంచాయతీ హౌసింగ్ అధికారులతో కలిసితో కలిసి పాల్గొని మాట్లాడారు.

జిల్లాలో ఏప్రిల్ 1 నుండి 100% ఇసుక సరఫరా మన ఇసుక వాహనం ద్వారా ఆన్లైన్ విధానంలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇసుక రవాణా పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమంగా ఇసుక రవాణా చేసే వాహనాలు పట్టుబడితే బైండోవర్ కేసులు నమోదు చేసి జరిమానా విధించాలని ఆదేశించారు. ప్రతి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో ఇసుక అందించేందుకు ఆన్లైన్లో నమోదు చేయించాలన్నారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఒక మొబైల్ టీం ఏర్పాటు చేసి అక్రమంగా ఇసుక రవాణాను అడ్డుకోవాలన్నారు.తహసీల్దార్లు వారానికి కనీసం రెండు సార్లు రీచ్లను సందర్శించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.