27 March, 2026 | 2:50 AM

నా నియోజకవర్గంలో ప్రజలకు అవస్థలు

27-03-2026 12:57 AM

అన్నదాతకు వరి, పంట నష్టపరిహారం ఘోషలు

అసెంబ్లీ సమావేశాల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తెగిన వంతెనలు రహదారులు రోడ్ల వంశంపై అసెంబ్లీలో చర్చ ఎమ్మెల్యే మదన్మోహన్

నా నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు అందించండి అసెంబ్లీలో సంబంధిత శాఖ అధికారులను వేడుకున్న ఎమ్మెల్యే మదన్

ఎల్లారెడ్డి, మార్చి26 (విజయక్రాంతి) : నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత మూడు మాసాల క్రితం కురిసిన కుంభ వర్షానికి రహదారులు వంతెనలు గ్రామాల రాకపోకలు చెరువులు పలుచోట్ల పంట పొలాలు రైతులకు జరిగిన భారీ నష్టం పట్ల ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రత్యేకంగా చర్చించారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల కొరకు ఎమ్మెల్యే మదన్మోహన్ ఎంతో చాకిచకంగా సంబంధిత శాఖ అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు అందించి నా నియోజకవర్గంలో ప్రజలను సంరక్షించే విధంగా అవకాశాన్ని కల్పించాలని అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మదన్మోహన్ కోరారు.

ముఖ్యంగా కామారెడ్డి జిల్లా నుండి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మార్గమధ్యలో ఉన్న లింగంపేట్ మండలంలోని వంతెన తెగిపోవడం లింగంపేట్ నుండి ఎల్లారెడ్డి కి రావడానికి మార్గమధ్యంలో పలుచోట్ల రహదారులు అంతరాయం కలగడం వంటి సమస్యల పట్ల నోరు మెదపారు. అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట లింగంపేట తాడ్వాయి గాంధారి మండలాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని నష్టపోయిన రైతులకు కనీసం నష్టపరిహారం అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర సంబంధిత శాఖ మంత్రులను ప్రత్యేకంగా సంబంధిత నిధులు మంజూరు చేయాలని కోరారు.

అలాగే ఎల్లారెడ్డి పట్టణంలో నూతనంగా నిర్మాణమైన బస్టాండ్ లో పలు సమస్యలు ఉన్నట్లు వాటిని బాన్సువాడ డిపో మేనేజర్ ఆర్టీసీ శాఖ సంబంధిత శాఖ అధికారులు బాగోగుల పట్ల సరిగ్గా లేకపోవడం ప్రజలకు తీవ్ర అవస్థలు కలగడం జరుగుతుందని వాటిని తక్షణమే పనులు అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు వినతి పత్రం అందజేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం కలగాలని ప్రతి గ్రామానికి బస్ సౌకర్యం కలిగిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సంబంధిత శాఖ మంత్రి వారిని కోరారు.

అలాగే ఎల్లారెడ్డి పట్టణం నుండి జిల్లా హెడ్ క్వార్టర్ కామారెడ్డికి మరియు హైదరాబాద్ కు మరికొన్ని నూతన బస్సులను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ప్రత్యేకంగా తెలియపరిచారు. అనంతరం ఆరుగాలం శ్రమించే రైతులకు అవస్థలు బాగా ఉన్నాయని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటికే లెక్కలు చేసి కట్టలు కట్టిపెట్టిందని అర్హులైన లబ్ధిదారులకు నీట మునిగిన పంటలకు ఎకరానికి హెక్టార్కు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందిస్తే నా నియోజకవర్గ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారని సభలో ఆశాభావం వ్యక్తం చేశారు. మదన్మోహన్ మాట్లాడిన చర్చపై అసెంబ్లీలో సంబంధిత శాఖ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.