ఖమ్మంపల్లి వంతెనపై పగుళ్లు
25-04-2024 02:24 AM
గాలిదుమారానికి సోమవారం అర్ధరాత్రి ముత్తారం మండలంలోని ఓడేడులో మానేరుపై నిర్మించిన వంతెన కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించుకపోవడంతోనే ఘటన జరిగిందని వేరే చెప్పనక్కర్లేదు. తాజాగా బుధవారం ఇదే మండలంలోని ఖమ్మంపల్లిలో మానేరుపై రూ.50 కోట్లతో నిర్మించిన వంతెనపై స్థానికులు పగుళ్లు గుర్తించారు. ఏదైనా అనర్థం సంభవించకముందే ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.
మంథని, ఏప్రిల్ 24 (విజయక్రాంతి)






