15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వృద్ధులు, నిరక్షరాస్యులే టార్గెట్..

21-10-2025 10:30 PM

- ఏటీఎం కార్డుల దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్థుడి అరెస్ట్..

- ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన..

- మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డిసిపి సునీత రెడ్డి..

- నిందితుడి నుంచి రూ.6 లక్షల 31 వేల నగదు, బ్రీజా కారు, 23 ఏటీఎం కార్డులు స్వాధీనం..

ఇబ్రహీంపట్నం: ఏటీఎం సెంటర్ ల వద్ద వృద్ధులు, నిరక్షరాస్యత గల అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ వారి దృష్టి మరల్చి ఏటీఎం కార్డుల వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోగా.. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మహేశ్వరం జోన్ డీసీపీ సునీత రెడ్డి(DCP Sunitha Reddy) వివరాలు వెల్లడించారు. అబ్దుల్లాపుర్మెట్ మండలం, తుర్కయంజాల్, జన చైతన్య కాలనీకి చెందిన మోహన్ రావు జోషి(38) ఈనెల 11వ తేదీన తుర్కయంజాల్ లోనీ ఎస్బిఐ ఎటిఎం కు వెళ్లి నగదు తీసుకునేందుకు నిందితుడైన, పరిచయం లేని, సుధనాబోయన వెంకటేష్ సహాయంతో ఏటీఎం స్వైప్ చేశారు.

అనంతరం బాధితుడైన మోహన్ రావు ఈనెల 15న బ్యాంకుకు వెళ్లి ఖాతాను తనిఖీ చేసి చూడగా, ఖాతా నుండి రూ.40,000/- డెబిట్ కావడమే కాకుండా, అతని ఏటీఎం కార్డుకు బదులు వేరే కార్డు ఇచ్చినట్లు గుర్తించాడు. కాగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి, నేరస్తుడినీ ఎట్టకేలకు అరెస్టు చేశారు. నేరస్తుడైన వ్యక్తి సూర్యపేటకు చెందిన సుధనాబోయన వెంకటేష్(37), వృత్తి కారు డ్రైవర్. గత కొంతకాలంగా నాగారం, ఇస్మాయిల్ గూడ లోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. రాచకొండ కమిషనర్ రేట్ పరిధిలో వివిధ ఏటీఎం సెంటర్ లలో ప్రజల దృష్టి మరల్చి డబ్బులను డ్రా చేస్తున్న నెరస్థున్ని ఆదిభట్ల పోలీసులు తుర్కయంజాల్ లోని ఎస్‌బిఐ బ్యాంక్ సమీపంలో నేరస్థుడిని అరెస్టు చేశారు. గతంలో కూడా ఇతడిపై రాష్ట్రంలో పలు ప్రాంతాలైన సూర్యాపేట, ఖమ్మం 26 కేసులు ఉన్నాయని, 2021 నుండి 27 కేసులు నమోదు అయినట్లు తెలిపారు.

ముఖ్యంగా వృద్ధులు, నిరక్షరాస్యులను టార్గెట్ చేసి ఏటీఎంకు వచ్చిన వారు మిషన్లో పిన్ ఎంట్రీ చేస్తుండగా చూసి, సహాయం అందిస్తున్నట్లు నటించి, అట్టి ఏటీఎం లను దొంగిలించి, అందులో నగదు కాజేస్తాడు. అంతేకాకుండా కార్డు స్వైప్ చేయడం రానివారికి స్వైప్ చేసి నకిలీ, పనిచేయని కార్డులను మార్చి ఇస్తుంటాడు. ఇతడిపై సూర్యాపేట, ఖమ్మం, హైదరాబాద్ కమిషనరేట్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయి. 2021 సంవత్సరంలో చంచల్ గూడ జైలు నుండి విడుదల అయ్యాడు. అప్పటికి తీరు మారకపోవడంతో పీడీ యాక్ట్ కు పెట్టడం జరిగిందని తెలిపారు. మరల ఏటీఎం సెంటర్ ల వద్ద అనుమాస్పదంగా తిరుగుతున్న నిదింతుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపి నిందితుడిని రిమాండ్ కు తరలించడం జరిగిందని డిసిపి తెలిపారు. నిందితుడి నుండి రూ.6 లక్షల 31వేల నగదు, ఒక సెల్ ఫోన్, వివిధ బ్యాంక్ లకు చెందిన 23 ఏటీఎం కార్డులు, ఒక బ్రీజా కారు స్వాధీనం చేసుకొని నేరస్తుడిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నందుకు గాను డిసిపి సునీత రెడ్డి, ఏసిపి కెపీవి రాజులు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ సిఐ రవికుమార్, ఎస్సైలు, సిబ్బందినీ అభినందించారు.