calender_icon.png 22 October, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్లుగీత కార్మికుల హక్కులను సాధిస్తాం

21-10-2025 10:36:05 PM

కల్లుగీత కార్మిక సంఘం మండల కమిటీ ఎన్నిక..

గరిడేపల్లి (విజయక్రాంతి): కల్లుగీత కార్మికుల హక్కులను సాధించేందుకు కృషి చేస్తామని ఆ సంఘం జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు అన్నారు. మండలంలోని పొనుగోడు గ్రామంలో మంగళవారం జరిగిన మండల కల్లుగీత కార్మిక సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతామని వాటిని సాధించే వరకు విశ్రమించమని ఆయన అన్నారు. గీత కార్మికులకు అందించాల్సిన, పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియా వెంటనే అందించాలని కోరారు. దీంతో పాటు పింఛన్లు, బైకులు, రక్షణ మోకులు గీత కార్మికులకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. గీత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 27న తుంగతుర్తి లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గార్డెన్లో జరిగే జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కోరారు.

అనంతరం ఏకగ్రీవంగా ఎన్నుకున్న గరిడేపల్లి మండల గీత కార్మిక సంఘం కమిటీని ఆయన ప్రకటించారు. గరిడేపల్లి మండల కల్లుగీత కార్మికుల సంఘం అధ్యక్షులుగా మండవ సైదులు, ప్రధాన కార్యదర్శిగా బుల్లెపల్లి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా గుండు శంభయ్యతో పాటు కమిటీ సభ్యులు కూడా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంఘం ఉపాధ్యక్షులు తుమ్మల సైదయ్య,జెర్రీ పోతుల కృష్ణ, మండల ఉపాధ్యక్షులు యమ గాని వెంకన్న,సహాయ కార్యదర్శి నర్సింగ్ వెంకన్న,కమిటీ సభ్యులు బత్తిని యుగంధర్,బండి తిరపయ్య,చామకూరి సైదులు, కారింగుల మోహన్,వెంకన్న, నాగేశ్వరరావు, లక్ష్మయ్య,ధనం మూర్తి,పుల్లయ్య, నరసయ్య, హుస్సేన్, జానయ్య, సైదులు, రామ నర్సయ్య, మల్లయ్య,రాములు, బిక్షం,నారాయణ,లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.