07-10-2025 12:11:31 PM
హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రులు(Congress ministers) అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ మధ్య విభేదాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) స్పందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై మంత్రి పొన్నం అనుచిత వ్యాఖ్యలు చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రులు లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ తో మహేష్ గౌడ్ ఫోన్ లో మాట్లాడారు. ఇద్దరు సమన్వయంతో కలిసి పనిచేసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు సూచించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చొరవతో ఇద్దరి మధ్య వివాదం సద్దుమణిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) దున్నపోతు వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గేకు, మీనాక్షికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ లేఖ రాశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Minister Adluri Lakshman) డెడ్‌లైన్ ఇచ్చారు.
దున్నపోతు వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రుల మధ్య వివాదం మరింత ముదురుతుంది. రేపటి వరకు టైం ఇస్తున్నా.. పొన్నం క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై పొన్నం ప్రభాకర్ మాట మారిస్తే తర్వాత జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలని లక్ష్మణ్ హెచ్చరించారు. నేను మాదిగను కాబట్టే మంత్రి పదవి వచ్చిందని ఆయన వివరించారు. నేను మంత్రి కావడం.. మా సామాజిక వర్గంలో పుట్టడం తప్పా? అని ప్రశ్నించారు. పొన్నం మాదిరిగా అహంకారంగా మాట్లాడటం తనకు రాదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. పొన్నం తన తప్పు తెలుసుకుంటారని అనుకున్నా అన్నారు. త్వరలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కలుస్తానని మంత్రి అడ్లూరి తెలిపారు. తాను పక్కన కూర్చుంటే మంత్రి వివేక్(Minister Vivek) సహించట్లేదని మంత్రి అడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు. పక్కన కూర్చుంటే వివేక్ లేచి వెళ్లిపోతున్నారని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు.