10 August, 2026 | 8:07 AM

సర్వేలు కాదు... పరిహారంపై హామీ ఇవ్వాలి

02-09-2025 06:59 PM

భైంసా: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ముధోల్ నియోజకవర్గం కోట్లాది రూపాయల పంట నష్టం జరిగిందని ప్రభుత్వం వెంటనే సర్వేలు నిర్వహించి పరిహారం పై రైతులకు భరోసా కల్పించాలని టిఆర్ఎస్ నేత కే కిరణ్, ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మంగళవారం బాసర ముధోల్ కుంటాల కుబీర్ మండలంలో వరదల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి 25000 నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విన్నవించాలేని పక్షంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పోరాటం చేస్తామన్నారు