06-12-2024 12:55:36 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (విజయక్రాంతి): జీహెచ్ఎంసీలో హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ (హెచ్-సిటీ) ప్రాజెక్టులో భాగంగా రహదారుల విస్తరణ, ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా పరమైన అనుమతులు జారీ చేస్తూనే రూ.5,942 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఎంఏయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ జీవో నంబరు 627ను జారీ చేశారు.