06-12-2024 12:57:17 AM
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): పాలమూరు ప్రాజెక్టు వెంకటాద్రి రిజర్వాయర్ పరిధిలోని వట్టెం పంప్‌హౌజ్‌లోని బాహుబలి మొదటి పంపు డ్రైరన్ గురువారం రాష్ట్ర ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ముఖ్య సలహాదారు పెంటారెడ్డి నిర్వహించారు. రెండు నెలల క్రితం భారీ వర్షాలకు శ్రీపురం గ్రామ పరిధిలోని ఆడిట్ టర్నెల్ ద్వారా వరదనీరు వట్టెం పంపుహౌజ్‌లోకి చేరి పంపులను ముంచెత్తింది. వెను వెంటనే నీటిని తోడి తిరిగి ఐదు పంపులను సిద్ధం చేసి ఒక పంపు డ్రైరన్ చేపట్టినట్టు ఆయన తెలిపారు. నార్లాపూర్ ఏదుల మద్యలో 3.50 కిలోమీటర్లు మాత్రమే కెనాల్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని ఏడాదిలోపు పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటిని అందిస్తామన్నారు. ఆయనవెంట ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈ పార్థసారది ఉన్నారు.