13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

పంచాయతీలకు రూ.277 కోట్లు

14-01-2026 01:55 AM
  1. అభివృద్ధి నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఆర్థిక శాఖ మంత్రి భట్టి ఆదేశాల మేరకు విడుదల 

హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): రాష్ర్టంలోని గ్రామ పంచాయ తీలకు రాష్ర్ట ప్రభుత్వం సంక్రాంతి పండుగకు తీపి కబురు అందించింది. గ్రామాల అభివృద్ధి, ఇతర అవసరాల కోసం రూ.277 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేర కు ఆర్థిక శాఖ నుంచి మంగళవారం నిధులు విడుదల అయ్యాయి. ఈ సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రతినిధులకు ఆయ న సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. కాగా, తాజాగా విడుదల చేసిన నిధులతో గ్రా మాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావడమే కాకుండా, పంచాయతీల నిర్వహణ మరింత సులభతరం కానుంది. 

మంత్రి సీతక్క హర్షం

గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కావడం పట్ల పంచాయతీ రాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు ఇది ఒక గొప్ప ప్రోత్సాహకరమైన సంకేతమని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు వంటి అత్యవసర అవసరాలను వేగంగా తీర్చేందుకు ఈ నిధులు ఎంతో దోహదపడతా యని తెలిపారు. పంచాయతీలకు పెండింగ్ లేకుండా నిధులు అందేలా చొరవ చూపిన ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.