13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

సంతోషంగా పండుగలు జరుపుకోవాలి

14-01-2026 01:56 AM
  1. పతంగులు ఎగరవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం

హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): తెలుగు ప్రజలందరికి ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను అందించే భోగి, కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధ్ది పథకాలన్ని రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి చేరాలనేది తమ సంకల్పమన్నారు.

వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, ఉత్పత్తులు, సేవల రంగంలో తెలంగాణ రాష్ట్రం తిరుగులేని పురోగతిని సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నారు. తెలంగాణ రైజింగ్  విజన్ సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలందరూ సంతోషంగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి పండుగ సంబురాలు జరుపుకోవాలన్నారు. పతంగులు ఎగరవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.