calender_icon.png 25 December, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి నియోజకవర్గానికి 20 కోట్ల నిధులు మంజూరు

05-11-2024 02:54:55 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు షబ్బీర్ అలీ

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి నియోజకవర్గానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి 20 కోట్లు మంజూరైనట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు షబ్బీర్ అలీ మంగళవారం తెలిపారు. హైదరాబాద్ లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కలిసి నిధులు కేటాయించాలని కోరగా 20 కోట్ల సి.ఆర్.ఆర్ నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపినట్లు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.