17 April, 2026 | 10:33 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఇనుగుర్తి మండల అభివృద్ధికి రూ. 1.25 కోట్లు మంజూరు

28-05-2025 12:00 AM

మహబూబాబాద్, మే 27 (విజయక్రాంతి): రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తన స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి కోటి 25 లక్షల రూపాయలను మంజూరు చేశారు. నిధుల విడుదలకు సంబంధించిన వివరాలను ఎంపీ రవిచంద్ర తన సోదరుడు వద్దిరాజు కిషన్ ఇనుగుర్తి మండల కేంద్రంలో ప్రకటించారు.

పెనుగుర్తి మండలంలోని ఇనుగుర్తికి 20 లక్షలు, చిన్న నాగారం కు 20 లక్షలు, కోమటిపల్లి కి 25 లక్షలు, తారా సింగ్ తండాకు 20 లక్షలు, చిన్న ముప్పారంకు 15 లక్షలు, మీఠ్యా తండాకు 10 లక్షలు, పెద్ద తండా కు 5 లక్షలు, లక్ష్మీపురం కు 5 లక్షలు, పాత తంగాకు ఐదు లక్షలు కేటాయించారు.

నిధులు మంజూరు చేసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కు, కృషిచేసిన జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావుకు ఆ పార్టీ నాయకులు కృతజ్ఞతలు చెప్పారు.

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ లు దీకొండ వెంకన్న, గుండా వెంకన్న, కసర బోయిన విజయ్ యాదవ్, నీలం యాకయ్య, నారాయణరెడ్డి, రాజు నాయక్, నరేష్ నాయక్, బేతమల్ల చంద్రయ్య, మహేష్, పింగళి శ్రీనివాస్, పప్పుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.