calender_icon.png 20 January, 2026 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్ల మరమ్మతులకు 25.95 కోట్లు

02-10-2024 02:42:02 AM

మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): గ్రామీణ రహదారుల మరమ్మత్తుల కోసం రూ.25.95 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి నిధులు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రహదారుల మరమ్మతుల కోసం రూ.25.95 కోట్లు కోరుతూ ప్రభుత్వానికి గత నెలలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రతిపాదనలు పంపారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.