calender_icon.png 20 January, 2026 | 10:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిడ్ డే మీల్స్‌కు 30.16 కోట్లు విడుదల

02-10-2024 02:44:14 AM

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): మిడ్ డే మీల్స్‌కు సంబంధిం చిన నిధులను పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. మొత్తం రూ.30.16 కోట్లను కుక్కింగ్ కాస్ట్ కింద విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నర్సింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల పెండింగ్ బిల్లుల కోసం ఈ నిధులను మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. ఇందులో కుక్కింగ్ కాస్ట్ కింద ఎస్సీ విద్యార్థులకు రూ.6.13 కోట్లు, జనరల్ రూ.21.06 కోట్లు, ఎస్టీ 2.96 కోట్ల నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఈ నిధులను మంజూరు చేశారు.