calender_icon.png 22 October, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

22-10-2025 10:13:16 AM

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాల్లో కార్తీక మాసం శోభ కనిపిస్తుంది. బుధవారం తెల్లవారుజాము నుంచే నదీతీరాలలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగిస్తున్నారు. శివనామ స్మరణతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి. వరంగల్ లోని వెయ్యి స్తంభాల గుడి(Thousand Pillar Temple) వద్ద భక్తుల రద్దీ నెలకొంది. కీసర రామలింగేశ్వరస్వామి దేవాలయంలో(Keesara Ramalingeswara Swamy Temple) భక్తులు పూజలు చేస్తున్నారు. ములుగు జిల్లా రామప్ప దేవాలంయలో భక్తుల సందడి నెలకొంది. వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో(Vemulawada Raja Rajeshwara Swamy Temple) భక్తుల రద్దీ పెరిగింది. శ్రీశైలంలో కార్తీక మాస సందడి ప్రారంభమైంది. శ్రీశైలంలో నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు.భ్రమరాంబ, మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.