22-10-2025 09:14:58 AM
బండి ఆపి వివరాలు అడిగిన కానిస్టేబుల్ పై బ్లేడ్ తో దాడి
హైదరాబాద్: విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్(Constable)పై ఓ యువకుడు దాడికి ప్రయత్నించిన సంఘటన నిర్మల్ జిల్లాలో(Nirmal District) చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఆపిన కానిస్టేబుల్ రహమాన్ వివరాలు అడిగాడు. దీంతో ఆగ్రహించిన యువకుడు కానిస్టేబుల్ పై బ్లేడుతో దాడికి ప్రయత్నించాడు. యువకుడిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. నిందితుడు బుధవారపేటకు చెందిన అన్వర్ గా గుర్తించారు. కానిస్టేబుల్ రహమాన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.