22-10-2025 09:29:44 AM
హైదరాబాద్: ఎల్లారెడ్డి గూడలోని(Yellareddy Guda Sadar Jatara) సదర్ ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. సదర్ ఉత్సవాల(Sadar Festival) కోసం తెచ్చిన దున్నపోతు జనంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన చికిత్స నిమిత్తం తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. అటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బోయిన్ పల్లి కంసారి బజార్ లో జరిగిన సదర్ వేడుకల్లో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. యాదవ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడకకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు.
సదర్ ఉత్సవాల్లో దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విద్యుత్ దీపాల వెలుగుల మధ్య దున్నలు సందడి చేశాయి. దున్నపోతల విన్యాసాలు చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం నాడు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సదర్ ఉత్సవ మేళా(Sadar Festival Fair) సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నారాయణగూడలోని వైఎంసీఏ(YMCA) దగ్గర సదర్ ఉత్సవ మేళా నిర్వహిస్తున్నారు. దీంతో రాంకోటి, లింగంపల్లి, నారాయణగూడ, బర్కత్పూరా, హిమాయత్ నగర్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.