calender_icon.png 22 October, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సృష్టి కేసులో ఈడీ విచారణ

22-10-2025 10:37:14 AM

హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్(Universal Srushti Fertility Center) కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) విచారణ చేస్తున్నారు. పాచిపల్లి నమ్రత అలియాస్ అథ్లూరి నమ్రతతో, కల్యాణి, నందిని, సంతోషి, జయంత్ కృష్ణను ఈడీ ప్రశ్నించనుంది. కోర్టు అనుమతితో చంచల్ గూడ జైలులోనే నిందితులను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. నిందితులను వారంపాటు ప్రశ్నించేందుకు కోర్టు ఈడీకి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. హైదరాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌తో ముడిపడి ఉన్న ఐవీఎఫ్, సరోగసీ కుంభకోణం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.