22-10-2025 09:07:09 AM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు(Jubilee Hills by-election) 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. బుధవారం నాడు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లను పరిశీలించనున్నారు. ఈ నెల 24న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.నవంబర్ 14న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Jubilee Hills BRS MLA Maganti Gopinath) చనిపోవడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యం అయింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జెండా పాతాలని ప్రయత్నిస్తుంటే, బీఆర్ఎస్ తన స్థానాన్ని కాపాడుకునేందుకు ప్రచారంలో దూసుకుపోతోంది.