22-10-2025 09:56:27 AM
మేడ్చల్,(విజయక్రాంతి): మద్యం మత్తులో గొడవపడి తండ్రిని కన్న కొడుకు హత్య చేసిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో(Medchal Police Station Area) చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచ్చాయిపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్ తన కొడుకు షేక్ సాతక్ అతని స్నేహితుడు రాజు తో కలిసి ప్రజయ్ వాటర్ ప్లాంట్ వద్ద మంగళవారం రాత్రి మద్యం సేవించారు. మద్యం మత్తులు లో తండ్రి కొడుకు గొడవ పడ్డారు. దీంతో కొడుకు షేక్ సాతక్ బండ రాయి తో తండ్రిని దారుణంగా కొట్టి హత్య చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కొడుకుతో పాటు స్నేహితుడు రాజును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు