calender_icon.png 28 December, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గూడెంలో భక్తుల సందడి

06-11-2024 06:28:53 PM

దండేపల్లి (విజయక్రాంతి): తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధి చెందిన గూడెం శ్రీ రమసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాసం బుధవారం పంచమి తిథి కావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. వందలాది మంది దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతలు చేసుకున్నారు. భక్తులకు తాగునీటి వసతి, ఇతర సౌకర్యాలు కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆలయం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఏర్పాట్లు చేసారు.