20-05-2024 01:00:36 AM
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు, కోడె మొక్కులు చెల్లించుకునేందుకు తెల్లవారుజామునుంచి క్యూలైన్లలో బారులు తీరారు. కోడెమొక్కులు, కుంకుమపూజలతో భక్తిభావం ఉప్పొంగింది. భక్తులరద్దీతో పట్టణంలో ట్రాఫిక్ జామ్ నెలకొంది.