20-05-2024 01:01:34 AM
కామారెడ్డి, మే 19 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణం ఆర్‌బీ నగర్‌లో గల ఆంజనేయసామి దేవాలయంలో ఆదివారం సువర్చల సహిత హనుమత్ కల్యాణోత్సవం ఘనంగా చేపట్టారు. బ్రహ్మశ్రీ గంగవరం నారాయణశర్మ, గంగవరం ఆంజనేయ శర్మ, ఆలయ అర్చకులు సూర్యకాంతరావు సతీష్ పాండే ఆధర్యంలో వేడుకలు జరిగాయి. అనంతరం గణపతి పూజ, అభిషేకం నిర్వహించారు.