calender_icon.png 13 November, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్న కూతురిని కడతేర్చిన తల్లిదండ్రులు

20-05-2024 12:59:56 AM

మతిస్థిమితం లేదని బిడ్డకు ఉరి

తల్లిదండ్రుల అరెస్ట్

రాజన్న సిరిసిల్ల, మే19(విజయక్రాంతి): మతి స్థిమితం లేదని కన్న కూతురిని ఉరివేసి హత్య చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. 

ఇదీ కేసు..

తంగళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన చెప్యాల యెల్లవ, నరసయ్య కుమా ర్తె ప్రియాంక(24) ఈ నెల 14న మృతిచెందింది. ఆమె మరణంపై  గ్రామస్తులు అను మానం వ్యక్తం చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రియాంక తల్లిదండ్రులను విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.  సమావేశంలో సిరిసిల్ల రూరల్ ఇంచార్జ్ సి.ఐ ఎల్లారెడ్డిపేట్ సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ సుధాకర్ పాల్గొన్నారు. 

అసలు కథ... 

పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ప్రియాంక ఏడు సంవత్సరాల నుండి మానసిక వ్యాధి తో బాధపడుతోంది. ఆసుపత్రులు, దేవాలయాల చుట్టూ తిప్పారు. వేల రూపాయలు ఖర్చు చేశారు. చివరకు కొంతమేర నయం అయిందనుకున్నాక..   2020లో  నంగునూరు మండలం దర్గపల్లికి చెందిన పృథ్వీతో ప్రియాంకకు పెళ్లి చేశారు. బతుకుదెరువు కోసం ప్రియాంక, పృథ్వీ కరీంనగర్ వెళ్లి.. సప్తగిరి కాలోని లో ఉంటున్నారు. ప్రస్తుతం 13 నెలల కొడుకు ఉన్నాడు.

తిరగబడ్డ మానసిక వ్యాధి..

నెల రోజులుగా ప్రియాంక మానసిక స్థితి మళ్లీ తిరగదోడింది. ఆమె ప్రవర్తనలో మా ర్పులు అందరిని ఇబ్బందికి గురిచేశాయి. చుట్టుపక్కల వారిని ధూషించటం, గొడవలతో కుటుంబంలో ఆందోళన నెలకొంది. ఈ  విషయాన్ని పృథ్వీ తన అత్తామామలకు చెప్పాడు. మళ్లీ ఆస్పత్రిలో చూపిస్తామని ప్రియాంకను ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత  స్థానిక బుగ్గ రాజేశరసామి ఆలయం వద్ద మూడు రోజులు ప్రియాంకన ఉంచారు. అయినా ఆమెలో మార్పు రాకపోగా మరింత విపరీతంగా వ్యవహరించడం మొదలు పెట్టింది. తిరిగి ప్రియాంకను నేరెళ్లలోని సొంత ఇంటికి తీసుకెళ్తారు.  కుమార్తె బాగు కోసం చేసిన అప్పు లు భారంగా మారాయి. అయినా ప్రియాంక ఆరోగ్యం కుదుటపడే పరిస్థితి లేదు. దీనిని అవమానంగా భావించిన తల్లిదండ్రులు కుమార్తె పీడను వదిలించుకోవా లని మంగళవారం రాత్రి నిద్రిస్తున్న ప్రియాంకను ఉరివేసి హత్య చేశారు.