రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
09-06-2024 10:50 AM
రాజన్నసిరిసిల్ల : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుండి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులతో పరిసరాలన్నీ సందడిగా మారాయి. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.






