14 July, 2026 | 2:11 AM

అద్దె వాహనాల యాజమానుల సమస్యలు పరిష్కారం చేస్తాం: బలరాం నాయక్

09-06-2024 12:08 PM

మంథని: సింగరేణిలో అద్దె యాజమానుల సమస్యలు పరిష్కారం చేస్తామని సింగరేణి సీ అండ్ ఎండి బలరాం నాయక్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో సీ అండ్ ఎండీ తో సమావేశమైన అద్దె వాహనాల యాజమానులు,  మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ లతో సీ అండ్ ఎండీ చర్చలు జరిపారు. సింగరేణి వ్యాప్తంగా సింగరేణి భూ నిర్వాసిత అద్దె వాహనాల యజమానులు గత సమస్యల గురించి గత సంవత్సర కాలంగా విన్నవించుకుంటున్నారు.  సమస్య లు పరిష్కారం కాకపోవడంతో ఈ నెల 5వ తేదీన, సింగరేణి డైరెక్టర్ ను కలిసి సమస్య గురించి చర్చలు జరిపారు. వారు సానుకూలంగా స్పందించకపోవడంతో ఆరోజు నుండి యాజమానులు సమ్మెకు దిగారు. 

మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ సమస్యను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి  తీసుకుపోయారు. మంత్రి అదేశాలతో తిరుపతి యాదవ్ సారధ్యంలో 11వ సింగరేణి డివిజన్లలోని  సింగరేణి భూనిర్వాసిత  వాహనాల యజమానులతో సింగరేణి సీ అండ్ ఎండీ  బలరాం నాయక్ తో సమావేశం అయ్యారు. అద్దె వాహనాల సమస్య గురించి వివరించి, పరిష్కారం చేసే విధంగా ఆలోచన చేయాలని కోరగా,  వారు వెంటనే సానుకూలంగా స్పందించి అద్దె వాహనాల యజమానుల సమస్యను వెంటనే పరిష్కరిస్తామని సీ అండ్ ఎండీ సింగరేణి భూనిర్వాసిత యజమానులకు హామి ఇచ్చారు. ఈ సమస్యలపై స్పందించిన  మంత్రి శ్రీధర్ బాబుకు,  తిరుపతియాదవ్ కు యాజమానులు కృతజ్ఞతలు తెలియజేశారు.