26-12-2025 02:14:30 PM
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి
చిన్నచింతకుంట: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి యువతకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత,ప్రజలు అందరూ సైబర్ నేరాలకు దూరంగా ఉంటూ సైబర్ మోసాలపై మీ గ్రామాల్లో, మీ తల్లిదండ్రులకు ప్రచారం చేసి అవగాహన కల్పించాలన్నారు. ఆన్‌లైన్ ట్రేడింగ్, నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, టెలిగ్రామ్, వాట్సప్‌లో టాస్క్ పేరిట జరిగే ఇన్వెస్టమెంట్ మోసాలతో జాగ్రత్త అవసరమన్నారు. ఇస్త్య్రాగామ్ ఫాల్ యూ టూబ్‌ల్లో లైక్‌లు కొడితే డబ్బులు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు ఆశ చూపించి మోసాలు చేస్తున్నారని అప్రమత్తంగా ఉండాలన్నారు. అధిక మొత్తంలో డబ్బులు పెట్టిన తరువాత మోసగాళ్లు మిమ్మల్లి బ్లాక్ చేస్తారన్నారు. ఆన్‌లైన్ లోన్ యాప్స్ వంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలన్నారు.
అప్రమత్తం అవసరం....
సైబర్ క్రైమ్ పెరుగుతున్న APK ఫైల్స్, డిజిటల్ అరెస్ట్ మోసాలు గ్రహించిన వెంటనే స్థానిక సైబర్ సెల్ లేదా 1930కి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ మద్యపానం సేవించకుండా రహదారి భద్రత నియమాలు పాటించి వాహనాలు నడపాలని, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాహనాన్ని రహదారి భద్రతా నియమాలు పాటించి నడపాలన్నారు. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వేగం కన్నా ప్రాణం మిన్న అని ద్విచక్ర వాహనదారులు వాహనాలను నడిపేటప్పుడు తప్పనిసరిగా మోటార్ వెహికల్ నిబంధనను పాటించాలని తల్లిదండ్రులు 14 సంవత్సరాల లోపు పిల్లలకు వాహనాలను ఇవ్వరాదని ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నందున అప్రమత్తంగా వాహనాలు నడపాలని యువత, ప్రజలు హెల్మెట్ రక్షణ గురించి తెలుసుకోవాలని ఎస్ఐ గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, యువత తదితరులు పాల్గొన్నారు.