చర్చలకు పిలిచి అక్రమ అరెస్టులా?
03-07-2026 12:34 AM
ప్రభుత్వంపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం
బడంగ్‌పేట్, జూలై 2 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేతలను చర్చలకు పిలిచి, కాంగ్రెస్ నాయకులు పారిపోవడమే కాకుండా వారిని అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.
గురువారం అరెస్టయి కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, జీవన్‌రెడ్డిలను సబి తా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఇంచార్జ్ కార్తీక్‌రెడ్డి పరామర్శించారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలను అణి చివేయడం తగదని, చర్చలకు ఆహ్వానించి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.






