3 July, 2026 | 1:00 AM

పొడిగింపులు సంప్రదాయమైతే.. పదోన్నతులు ఎట్లా?

03-07-2026 12:00 AM
  1. ఆ శాఖలో పదవి విరమణ పొందిన  పొడగింపు తథ్యమంట
  2. ప్రమోషన్ దక్కుతుందనే అధికారులకు నిరాశేనా!
  3. సరైనది కాదంటూ కింది స్థాయి  ఉద్యోగులలో అసహనం
  4. సీఎం మాట చెప్పిన అమలు చేయని అధికార యంత్రాంగం 

మహబూబ్ నగర్ జూలై 2 (విజయక్రాంతి) : కాలం పదవిని ముగించవచ్చు కాగా కర్తవ్యనిష్ఠకు లభించే గౌరవాన్ని ఎప్పటికీ ముగించలేదు. శాఖ ఏదైనా ఉన్నత అధికారి పదవి విరమణ పొందితే వారి పరిధిలోని అధికారులు ప్రత్యేక విందును ఏర్పాటు చేసి ఆ శాఖ అధికారులు వారు చేసిన సేవలను కొనియాడడం సర్వసాధారణం. మహబూబ్ నగర్ ఇరిగేషన్ శాఖలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఈ శాఖలో అధికారులకు పదవి విరమణ పొందిన పొడగింపుల పేరుతో సీటు వదలడం లేదు.

సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి పదవీ విరమణ పొందిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగింపులు ఇవ్వమని చెప్పినప్పటికీ సంబంధిత ఉన్నత అధికార యంత్రాంగం మాత్రం కిందిస్థాయి ఉద్యోగులకు ఆరు నెలలు.. నెలనెలాఅంటు పొడిగిస్తూ కిందిస్థాయి తోటి ఉద్యోగులకు ప్రమోషన్ లు రాకుండా వారు పెత్తనం చేస్తూ రావడం విడ్డూరంగా ఉంది.

ఏండ్ల తరబడి ప్రమోషన్ల కోసం నిరీక్షించిన అధికారులకు పదవి విరమణ పొందిన అధికారులు సైతం తిరిగి బాధ్యతల్లో కొనసాగడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తుంది. సీఎం మాటలను బేకతార్ చేస్తూ పదవి విరమణ పొందిన ఉద్యోగులకు పొడగింపు ఉత్తర్వులు వస్తూనే ఉండడం కిందిస్థాయి ఉద్యోగులకు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

ఇలా జరిగితే ఎలా.. ప్రమోషన్ వచ్చేనా?

పదవి విరమణ పొందిన ఇంజనీర్స్ కు ఎట్టి పరిస్థితులలో కొనసాగించమని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను తుంగ లో తొక్కి ఇరిగేషన్ శాఖలో హై లేవల్ లో రిటైర్మెంట్ అయిన ఇంజనీర్స్ కు నెల నెల ఒకరికి పొడగింపు  ఇస్తూ పోతున్నారు. ఇటీవల మంగళవారం పదవి విరమణ పొందిన   ఇంజనీర్-చీఫ్ (అడ్మిన్) టి.శ్రీనివాస్ కు సర్వీస్ ను ఆరు నెలలు పొడిగించారు.

గతం లో ఇంజనీర్-చీఫ్(జనరల్) రమేష్ బాబు కు,నాగర్ కర్నూల్ సిఇ విజయభాస్కర్ రెడ్డి కి రెండు పోస్టులు, మహబూబ్ నగర్ సిఇ ఎ.సత్యనారాయణ రెడ్డి కి రెండు పోస్ట్ లు పదవి విరమణ పొందిన తరువాత ఆరు ఆరు నెలలు సర్వీస్ ని పొడిగించారు. ఈ విధానం తో కింది స్థాయిలో ఉన్న ఇంజనీర్స్  ఎఈఈ, డీఈఈ, ఎఈ లకు  కు ప్రమోషన్స్ రాకుండా అన్యాయం జర్గుతుంది.

ఇప్పటికైనా ఎట్టి పరిస్థులలో ఈ పొడగింపు  ఇవ్వకుండా డీపీసీ లు కండక్ట్ చేసి పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ కలిపించాలని ఆ శాఖ పరిధిలోని ఉద్యోగులు మొరపెట్టుకుంటుండ్రు. కింది స్థాయిలో ఎఈఈ, డీఈఈ లు ఒకొక్కరు 15 నుంచి 16 ఏండ్లు పని చేసన దిగువ పోస్టులోనే పదవి విరమణ పొందాల్సి వస్తుంది. దీంతో ఏండ్ల తరబడి ఉద్యోగం చేసి పదవి విరమణ పొందిన సమయంలోనైనా పద్ధతి పొందకుండానే వెన్ను తిరగడంతో తీవ్ర ఆవేదనకు గురి అవుతూ ఉద్యోగులు కృంగిపోతుండ్రు.

ఈ విధానానికి స్వాస్తి పలికే విధంగా తోటి ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చేలా ఈ శాఖలో ఉన్నత హోదా లో ఉండి పదవి విరమణ సమయం వచ్చిన పొడగింపు పత్రాలు తీసుకు వస్తు విధులు నిర్వహిస్తున్న అధికారులు సైతం కిందిస్థాయి ఉద్యోగుల ఆవేదనను ఒక్క క్షణం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 పొడిగింపు సరి కాదు..

ఎట్టి పరిస్థితుల్లోనూ పదవి విరమణ పొందిన తర్వాత ఉన్నత హోదాలో ఉన్న అధికారులను పొడిగించడం ఎట్టి పరిస్థితుల్లో సరైన విధానం కాదు. ఎందుకు టీజీవో పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తుంది. ఏండ్ల తరబడి ఉద్యోగం చేసి పదవి విరమణ సమయంలో ఒక హోదాలో పదవి విరమణ పొందుదాం అనుకున్న కిందిస్థాయి ఉద్యోగులకు నిరాశ మిగిల్చడం సరికాదు. పొడగింపు లు తీసుకు వస్తున్న అధికారులు సైతం ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా అందరికీ న్యాయం జరిగేలా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలి.

 ఎస్ విజయ్ కుమార్, 

టీజీవో జిల్లా అధ్యక్షుడు, మహబూబ్ నగర్