3 July, 2026 | 1:38 AM

గుట్ట హుండీ ఆదాయం రూ.2.78 కోట్లు

03-07-2026 12:47 AM

యాదగిరిగుట్ట, జూన్ 2 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానంలో గురువారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. ఉ దయం సుప్రభాత సేవతో స్వయంభూవులకు అర్చన, అభిషేకం, ప్రాకారమంటపం లో నృసింహ హోమం, నిత్య కల్యాణాన్ని వై భవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి 28 రోజుల హుండీల ద్వారా ఆదాయం రూ.2,78,13,079లు- వ చ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ హుండీల్లో 17 దేశాల కరెన్సీలు వచ్చినట్లు తెలిపారు. స్వామివారి నిత్య రాబడిగా రూ. 16,57,370 వచ్చాయని ఆలయ అధికారులు తెలిపారు. కాగా లక్ష్మీ నర్సింహస్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూ లల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. వారికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.