3 July, 2026 | 1:28 AM

అవినీతి జరగలేదు!

03-07-2026 12:43 AM
  1. పారదర్శకంగా గురుకుల టెండర్లు
  2. కేటీఆర్, హరీశ్‌రావు, ఆర్‌ఎస్‌పీవి ఆరోపణలే..
  3. చర్చకు మేము రెడీ.. 
  4. మత్రులు అడ్లూరి, పొన్నం, అజారుద్దీన్ సవాల్ 
  5. అప్పులను లెక్కలతో నిరూపిస్తా   
  6. మంత్రి జూపల్లి కృష్ణారావు 
  7. బహిరంగ చర్చకు గన్‌పార్క్‌కు వచ్చిన మంత్రులు    
  8. బీఆర్‌ఎస్ నేతలు పారిపోయారని మంత్రి పొంగులేటి విమర్శలు

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి) : తెలంగాణలోని గురుకుల పాఠశాలల టెండ ర్ల వ్యవహారంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. గురుకులాల్లో భారీ అవినీతి జరిగిందంటూ బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ తీవ్రంగా ఖండించారు. టెం డర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేసిన మంత్రులు.. ఈ అం శంపై అసెంబ్లీలో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

గురుకుల టెండర్ల అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు గురువారం  గన్‌పార్కుకు వచ్చిన ముగ్గురు.. బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. మరో వైపు రాష్ట్ర అప్పుల అంశంపై చర్చకు గన్‌పార్క్‌కు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అప్పులు, పెండింగ్ బిల్లుల లెక్కలపై రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు చర్చకు రాకుండా పారిపోయారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.

ఎవరికి పడితే వారికి జవాబు చెప్పలేం 

ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రులు  లక్ష్మ ణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ పేర్కొన్నారు. ఎవరో, ఏదో తప్పుడు సమాచారం ఇస్తే దానిపై మాట్లాడవద్దని హితవు పలికారు. ఎవరికి పడితే వారికి జవాబు చెప్పలేమన్నారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజాప్రభు త్వమని, పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందన్నారు.

327 గురుకులాలను బీఆర్‌ఎస్ నేతలు తమ సొంత భవనాల్లో ఏర్పాటు చేశారని, అయినా బకాయిలు లేకుండా గ్రీన్ చానెల్ ద్వారా అద్దె చెల్లిస్తున్నామని తెలిపారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఒళ్లు, నాలుక దగ్గరపెట్టుకుని మాట్లాడాలని, ఏదిపడితే అది మాట్లాడటం సరికాదని మంత్రి పొన్నం హెచ్చరించారు. తప్పు జరిగితే అధికార పార్టీపైనే కొట్లాడిన వ్యక్తుల మని పేర్కొన్నారు.   

చర్చపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు

గురుకుల టెండర్లలో అవినీతి జరిగిందంటూ బీఆర్‌ఎస్ నేతలు చేసిన ఆరోపణల పై కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చర్చకు సిద్ధమని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ పేర్కొన్నారు. గన్‌పార్క్ వద్ద వారు మీడియాతో మాట్లాడారు. గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందని కేటీఆర్, హరీశ్‌రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చేసిన ఆరోపణలు అవాస్తవమని మండిపడ్డారు. ఆధారాలతో నిరూపిస్తే ముక్కు నేలకు రాసి పదవులకు రాజీనామా చేస్తామని మీడియాకు స్పష్టం చేశారు.

మొత్తం టెండర్లే రూ.1143 కోట్లు కాగా.. ఒకసారి రూ.2 వేల కోట్లు, ఇంకోసారి రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందని.. పూటకో విధంగా ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. మొత్తం కొనుగోళ్ల ప్రక్రియలో రూ.455.23  కోట్లు ప్రభుత్వరంగ సంస్థలకు ఇచ్చినట్లు మంత్రి పొన్నం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు మఫాత్‌లాల్ బట్టు దరించవద్దా? మాఫత్‌లాల్ మాకేమైనా చుట్టమా? అని ప్రశ్నిం చారు. బీఆర్‌ఎస్ నేతలు తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు.

బీఆర్‌ఎస్ హయాం లో గురుకులాల కార్యదర్శిగా ఉన్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, దీనిపై చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేస్తామని పొన్నం వెల్లడించారు. విద్యార్థులకు సంబంధించిన దుస్తులు, ఇతర వస్తుల కొనుగోళ్లు పారదర్శకంగా జరిగాయని, నాలుగు శాఖల ఆధ్వ ర్యంలో టెండర్లు  పిలిచినట్లుగా తెలిపారు.

టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చనే విష యం తెలియదా? అని పొన్నం ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు బాగుపడుతుంటే బీఆర్‌ఎస్ నాయకులు తట్టుకోలేకపో తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ ప్రభు త్వం చేసిన ప్రొక్యూర్‌మెంట్‌పై కూడా చర్చ కు సిద్ధంగా ఉన్నామన్నారు.