3 July, 2026 | 1:04 AM

సర్ సర్వేలో బీఎల్‌ఓలకు ఇక్కట్లు

03-07-2026 12:00 AM

ఇంటి నెంబర్ ఉన్నా ఓటర్లు కరువు 

తిరిగి తిరిగి ఇక్కట్లకు గురవుతున్న బీఎల్‌ఓలు 

కామారెడ్డి, జులై 2 (విజయక్రాంతి): సర్ సర్వేలో బిఏఎల్‌ఓ లు తికమక పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గం సర్ సర్వే కొనసాగుతుంది. అర్హులైన ఓటర్లు గుర్తింపు కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుంది.

ఇంటి నెంబర్ దొరికిన ఓటర్లు కరువు.. 

ఎస్ ఐ ఆర్ సర్వేలో అర్హులైన 18 సంవత్సరాలో నిండి పైబడిన వయసుగల వారికి ఓటు హక్కుపై ప్రభుత్వం సర్వే నిర్వహిస్తుంది. అర్హులైన ఓటర్లకు ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అర్హులైన ఓటర్లను గుర్తించేందుకు బిఎల్‌ఓ లను ప్రభుత్వం నియమించింది. రెవిన్యూ శాఖ, మునిసిపల్ శాఖ ఉద్యోగులను బిఎల్‌ఓ లుగా గుర్తించి వారికి బాధ్యతలను అప్పగించారు. ఇంటింటికి వెళ్లి అర్హులైన ఓటర్ల వివరాలను గుర్తించే పనిలో బిఎల్‌ఓ లు క్షేత్రస్థాయిలో వెళ్లారు. 

బీఎల్‌ఓలకు తలతిక్క సమస్యలు.. 

క్షేత్రస్థాయిలో అర్హులైన ఓటర్లను గుర్తించేందుకు ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేసేందుకు బిఎల్‌ఓలో క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి పరిశీలిస్తున్నారు. ఇంటి నెంబర్ ఉన్న ఓటర్లు ఉండడం లేదు. దీంతో లిస్టులో ఉన్న వారి వివరాలు కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకు తెలియదం టూ ఇంటి యజమానులు చెప్పడంతో బిఎల్వోలు బిత్తర పోతున్నారు. కనీసం వారి ఫోను నెంబర్ అయినా చెప్పండి అంటూ బి ఎల్ వో లు అడిగిన తమకు సంబంధం లేదంటూ ఇంటి యజమానులు చెప్తున్నారు.

వారి ఫోన్ నెంబర్లు మా వద్ద ఎందుకు ఉంటాయి, అంటూ బిఎల్‌ఓ లను ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం అద్దెకు ఉన్న వారి వివరాలు ఓటర్ లిస్టులో ఉండడంతో వారి గురించి వాకబ్ చేస్తున్న బిఎల్‌ఓ లకు ఇంటి యజమానుల సమాధానంతో బిత్తర పోతున్నారు. ఉన్నతాధికారులకు చెప్పుకోలేక అర్హులను గుర్తించేందుకు బి ఎల్ ఓ లు పడరాని పాట్లు పడుతున్నారు.

కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం 

18 సంవత్సరాలు నిండిన వయస్సు గలవారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకు నేందుకు ఎస్‌ఐఆర్ సర్వేను సద్విని యోగం చేసుకోవాలని బిఎల్‌ఓలు కోరుతున్నారు. 

ఎస్‌ఐఆర్ సర్వేతో అర్హులైన ఓటర్ల గుర్తింపు 

జిల్లాలోని అర్హులైన ఓటరులు ఎస్ఐఆర్ సర్వే ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన అందరికీ ఓటు హక్కు అవకాశం లభిస్తుందని ఈ అవకాశాన్ని ఓటర్లు ఉపయోగించుకోవాలి. ప్రతి ఇంటికి బిఎల్‌ఓలు వస్తున్నారు. వారి నుంచి ఎస్‌ఐఆర్ ఫారాలు తీసుకొని పూర్తి వివరాలు నమోదు చేసి బిఎల్‌ఓలకు అందజేయాలి. అర్హులైన వారికి ఎస్‌ఐఆర్ పారాలు రాకుంటే సంబంధిత తాసీల్దార్ కార్యాలయంలో బీఎల్‌ఓ వివరాలు తెలుసుకొని ఎస్‌ఐఆర్ దరఖాస్తులు పొందాలి.

 ఆశీష్ సంగువాన్,

కలెక్టర్, కామారెడ్డి