14 July, 2026 | 4:52 AM

ఓటర్ సమగ్ర సర్వే మీద సంస్కృతిక సారధుల కళా ప్రదర్శన

14-07-2026 12:00 AM

తుంగతుర్తి, జులై 13 : మండలంలోని కొత్తగూడెం గ్రామంలో భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను చేపట్టింది. తెలంగాణలో దీనికి సంబంధించిన సర్వే ఎన్యుమరేషన్ ప్రక్రియ జూన్ 25 నుండి ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ద్వారా నకిలీ, మరణించిన మరియు అర్హత లేని ఓటర్లను తొలగించడం దీని ముఖ్య ఉద్దేశం జాబితాను 2002 నాటి ఓటర్ల డేటాతో లింకు చేస్తున్నారు.

దీనివల్ల చిరునామాలు మారిన వారు, ఒకే కుటుంబంలో డూప్లికేట్ ఓట్లు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి అని సాంస్కృతిక సారధి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి శ్రీకాంత్ టీం లీడర్ గంటా బిక్షపతి కార్యక్రమంలో మాట్లాడినారు, కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారు, యువతి, యువకులు తమ తల్లిదండ్రుల వివరాలను కచ్చితంగా అందించవలసి ఉంటుంది. ఈ వివరాలు ఇస్తేనే కొత్త ఓటు నమోదు అవుతుంది. బి ఎల్ ఓ అధికారులు ప్రతి ఇంటికి వచ్చి ఫారాలు సేకరిస్తారు  అని కల ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ శ్రీకాంత్. తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి శ్రీకాంత్. టీం లీడర్ గంటా బిక్షపతి. సాంస్కృతిక సారధి కళాకారు గడ్డం ఉదయ్. పల్లెల లక్ష్మణ్. పల్లెల రాము. పాక ఉపేందర్. మద్దిరాల మంజుల. కుందమల్ల నాగలక్ష్మి. ములకలపల్లి మల్లమ్మ. నేమ్మది స్రవంతి. గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.