6 June, 2026 | 1:46 AM

9 నుంచి 11 వరకు సైబరాబాద్ పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్

06-06-2026 12:00 AM

సికింద్రాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీస్ ప్రెస్ ఫ్రెండ్లి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు టోర్నమెంట్ ఇంచార్జి డిసిపి సంజీవ్ తెలిపారు.శుక్రవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇరుజట్ల ప్రతినిధుల సమక్షంలో టోర్నమెంట్ డ్రాస్ తీశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ నేతృతంలో జరగబోయే ఈ టోర్నమెంట్ లో మీడియా నుండి 6 జట్లు,పోలీస్ శాఖ నుండి 3 జట్లు,మరొక అదనపు జట్టుకు అవకాశం కల్పించనున్నట్లు ఇంచార్జి తెలిపారు.

ఈనెల 9 నుండి11 వరకు 3 రోజుల పాటు జరగబోయే ఈ టోర్నమెంట్లో పాల్గొనే జట్లకు భోజన వసతి సౌకర్యాలతో పాటు క్రీడా కిట్ లు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.ఈ సమావేశంలో ఎసిపి నాగసాయి, ఆర్‌ఐ లు నాగరాజు,ప్రదీప్,విజయానంద్,కోచ్ ఝాన్సీ,హెచ్ సి ఎ ఎంపైర్ శ్రీనివాస్,మీడియా జట్ల ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.