6 June, 2026 | 1:44 AM

సీఎంసీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

06-06-2026 12:00 AM

నల్లగండ్ల హుడాలోని ఇల్యూషన్ థీమ్ పార్క్ వద్ద మొక్కలు నాటిన అధికారులు

శేరిలింగంపల్లి, జూన్ 5 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2026 సందర్భంగా నల్లగండ్ల హుడా కాలనీలోని ఇల్యూషన్ థీమ్ పార్క్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, సీఎంసీ కమిషనర్ డా. జి. శ్రీజన ఐఏఎస్, జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ మలెంపాటి ఐఏఎస్,అదనపు కమిషనర్ వి.వి.ఎల్. సుభద్రా దేవి ఐఎఫ్‌ఎస్, తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ,పట్టణ హరితీకరణలో ప్రతి పౌరుడి బాధ్యతను నొక్కి చెప్పుతూ, ఆక్రమణలను అరికట్టి భావితరాలకు హరిత వారసత్వం అందించాలని పిలుపునిచ్చారు. సైబరాబాద్ను పచ్చదనంతో నిండిన సుస్థిర నగరంగా తీర్చిదిద్దడానికి సీఎంసీ కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.