calender_icon.png 7 August, 2025 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి

25-07-2025 01:46:08 AM

తుంగతుర్తి, జులై 24 :   విద్యుదాఘాతంతో పాడి గేదే మృతి చెందిన ఘటన మండల పరిధిలోని సంగెం గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సంగెం గ్రామానికి చెందిన వంగూరి ముత్తయ్య అనే రైతుకు చెందిన పాడి గేదే మేత మేసేందుకు చెలకలోకి తోలక వెళ్ళినట్లు తెలిపారు.

మేత మేస్తున్న క్రమంలో ప్రమాదవశాస్తు విద్యుత్ తీగలు తగిలి గేదె అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. ఈ ఘటనతో సుమారు రూ.80 వేల వరకు నష్టం జరిగినట్లు బాధిత రైతు తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో పాడి గేదె మృతి చెందిందని, ప్రభుత్వం ఆదుకొని బాధితుడు కోరాడు.