07-08-2025 01:34:40 AM
తెలంగాణ ప్రజల తడాఖా చూపిస్తాం
బిల్లు ఆమోదించేవరకు నిద్రపోనియ్యం
* బలహీనవర్గాలపై మాజీ సీఎం కేసీఆర్ కక్ష గట్టారు. 50 శాతం రిజర్వేషన్లు మించకుండా చట్టం చేశారు. ఆ చట్టమే నేడు రిజర్వేషన్లకు గుదిబండగా మారింది.
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపును ఆమోదించకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దించుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. నరేంద్ర మోదీ లేకపోతే 150 సీట్లు కూడా బీజేపీకి రావని మోదీ భక్తుడు నిశికాంత్ దూబే అంటున్నారని, ఈసారి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ 150 సీట్లు దాటవని సీఎం అన్నారు.
బీసీ రిజర్వేషన్లను మోదీ అడ్డుకుంటే ఆయనను గద్దె దించి ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగురవేసి రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేసుకొని తమ డిమాండ్‌ను నెరవేర్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో బుధవారం నిర్వహించిన పోరుబాట మహా ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లా డారు.
గోద్రా అల్లర్ల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నాటి ప్రధానమంత్రి వాజపేయి కోరినా మోదీ రాజీనామా చేయలేదని.. ఇప్పుడు 75 ఏళ్లు నిండినం దున పదవి నుంచి వైదొలగాలని ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఫ్‌ు చాలక్ మోహన్ భగవత్ కోరుతున్నా నరేంద్ర మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
42% రిజర్వేషన్లు సాధించి తీరుతాం
స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సా ధించి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి స్ప ష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన బీసీ రిజర్వేషన బిల్లును రాష్ర్టపతి, కేంద్ర ప్ర భు త్వం ఆమోదించకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ బిల్లులు ఆమో దం పొందే వరకు తాము నిద్రపోయే ప్రసక్తే లేద ని స్పష్టం చేశారు. బలహీనవర్గాలపై మాజీ సీఎం కేసీఆర్ కక్ష గట్టారని, 50 శాతం రిజర్వేషన్లు మించకుండా చట్టం చేశారని విమర్శించారు.
నాడు కేసీఆర్ చేసిన చట్టమే నేడు రిజర్వేషన్లకు గుదిబండగా మా రిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ లో బలహీనవ ర్గాల బిడ్డలు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయ ర్లు కాకుండా అడ్డుగా ఉన్న చట్టాన్ని తొలగించాలని తామ ఆర్డినెన్స్ చేసి గవర్నర్‌కు పంపి స్తే.. ఆ బిల్లును ఆమోదించడం లేదని ‘సీఎం పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు స్థానిక ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఢిల్లీలో ధర్నాకు దిగామని, కేంద్రం మెడలు వంచైనా సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
రిజర్వేషన్లు పెంచే అదృష్టం నాకు వచ్చింది
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు తెలంగాణలోనైనా ధర్నా చేయొచ్చని, కానీ అక్కడ ధర్నా చేస్తే స్థానిక పార్టీలు మాత్రమే వస్తాయని, అందుకే ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని సీఎం తెలిపారు. ఢిల్లీలో ధర్నా చేయ డంతోనే కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎం పీలతో పాటు ఇండియా కూటమిలోని స మాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ, వామపక్షాలకు చెందిన వందమంది ఎంపీలు ధర్నా లో పాల్గొని సంఘీభావం తెలియజేశారని తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల సాధనలో అండ గా ఉంటామని యూపీ, బిహార్, మహారాష్ర్ట, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మద్దతు ఇచ్చారన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని భార త్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు ఏడా ది కాలంలోనే కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్ల బిల్లులను శాసనసభలో ఆమోదించా మని సీఎం వివరించారు.
దేశంలో వందేళ్ల కాలంలో ఏ రాష్ర్ట ప్రభుత్వం కులగణన చేయలేదని, ఇప్పటివరకు దేశంలో 300 మంది ముఖ్యమంత్రులైనా ఎవరూ చేయని పనిని చేసే అదృష్టం తనకు దక్కిందని, బీసీ ల రిజర్వేషన్లు పెంచే అవకాశం తనకు వ చ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు.
రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు..
తెలంగాణలో కేసీఆర్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాంచందర్‌రావు బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డుపడుతున్నారని ఆయన ఆగ్ర హం వ్యక్తం చేశారు. వారికి తెలంగాణ బీసీల అవసరం లేదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నాయకులు బీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాకు ఎందుకు రాలేదని, ఆ పార్టీ తెలంగాణతో పే రు బంధంతో పాటు పేగు బంధం కూడా తెంచుకుందా అని ప్రశ్నించారు.
బీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాను కేటీఆర్ డ్రామా అంటు న్నారని, కానీ కేటీఆర్ పేరే డ్రామారావు అని, కేసీఆర్ కుటుంబం డ్రామాలతో బతుకుతోందని సీఎం విమర్శించారు. అధికారం, పదవు లు పోయినా కేటీఆర్ బుద్ధి మారలేదని, అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. ఆ కుటుంబంలోనే ఒకరు రిజర్వేషన్లకు అనుకూలమని, మరొకరు ప్రతికూలమని, మరొ కరు అటూ ఇటూ కాకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
తడాఖా చూపిస్తాం..
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల విషయం లో తెలంగాణ ప్రజల శక్తిని మోదీ తక్కువగా అంచనా వేస్తే ఆయనకు తడాఖా చూపిస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. రిజర్వేషన్ల పెంపు బిల్లులను ఆమోదించకుంటే ఇక ఢిల్లీ రామ ని, గల్లీకి వచ్చినప్పుడు బీజేపీ నేతలను పట్టుకుంటామని హెచ్చరించారు. దళితులు, గిరి జనులకు అండగా నిలిచి ఇందిరాగాంధీ ప్రజల గుండెల్లో ఇందిరమ్మగా నిలి చిపో యారని సీఎం కొనియాడారు.
రాజీవ్‌గాంధీ తీసుకొచ్చిన ఐటీ విప్లవంతో అగ్రకులాల్లో చాలామంది విదేశాల్లో ఉన్నతస్థాయిల్లో స్థిరపడ్డారని తెలిపారు. ఇందిరా, రాజీవ్ వారసు డిగా వచ్చిన రాహుల్‌గాంధీ బీసీలకు న్యా యం చేసేందుకు కంకణం కట్టుకున్నారని, ఆయన మహత్తర ఆశయాలకు అడ్డుతగిలితే వారి చిరునామా గల్లంతవుతుందని హెచ్చరించారు. మోదీకి చిత్తశుద్ది ఉంటే రాష్ర్టపతి దగ్గర ఉన్న బిల్లులు తక్షణమే ఆమోదం పొం దేలా చూడాలని, లేకుంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు బీజేపీకి, మోదీకి గుణపా ఠం చెబుతారని హెచ్చరించారు.
ధర్నాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బా బు, జూపల్లి కృ ష్ణారావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, వివేక్, అ డ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కా ర్పొరేషన్ల చైర్మన్‌లు, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కేంద్రప్రభుత్వం ఒత్తిడితోనే ఓబీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును రాష్ర్టపతి ఆమోదించడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ఉద్యోగ, ఉపాధి, విద్యావకాశాల తో పాటు స్థానిక సంస్థలలో 42% రిజర్వే షన్లు అమలు పరిచేందుకు తెలంగాణా ప్ర భుత్వం వందేళ్ల తరువాత కులగణన నిర్వహించిందన్నారు. జంతర్ మంతర్ వద్ద నిర్వ హించిన ధర్నాలో మంత్రి ఉత్తమ్ మాట్లాడు తూ బిల్లును రాష్ట్రపతి నెలల తరబడి పెం డింగ్‌లో ఉంచడానికి కేంద్రం, బీజేపీయే కా రణమన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించ డం బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లే ద నే విషయం స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ పా ర్టీ మూలసిద్ధాంతమైన సామాజిక న్యా యం అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
బీసీలు వెనక్కి నెట్టవేయబడ్డారు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం దేశానికే ఆదర్శంగా తెలంగాణలో కులగణన చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బీసీలు వెనకబడ్డ వారు కాదని, వెనక్కి నెట్టివేయబడ్డవారని తెలిపారు. ‘జిత నీ ఆబాదీ.. ఉతనీ హిస్సెదారీ.. (ఎవరెం తో.. వారికంతా రావాల్సిందే’) అని స్పష్టం చేశా రు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు హ క్కు గా వారికి దక్కాల్సిందేనని అన్నారు. బీజేపీ గల్లీలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మా ట్లాడుతోందని మండిపడ్డారు. అగ్రవర్ణ ము ఖ్యమంత్రి, మంత్రులం మీతో పాటు ఇక్కడ ఉన్నామంటే బీసీలకు న్యాయం చేయడం కోసమేనని ఆయన పేర్కొన్నారు. బీసీల న్యా యమైన డిమాండ్ నెరవేర్చేందుకు తామెప్పుడు మద్దతుగానే ఉంటామన్నారు.
కవిత.. ఢిల్లీలో ధర్నా చెయ్ : మంత్రి పొన్నం ప్రభాకర్
బీసీ రిజర్వేషన్ల పోరాటం మరో తెలంగా ణ ఉద్యమంగా మారుతుందని మంత్రి పొ న్నం ప్రభాకర్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల అం శాన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడొద్దని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ఉద్యోగులకు, విద్యార్థులకు లబ్ధి చేకూరుతో ందని మంత్రి పేర్కొన్నారు. రాష్ర్టంలో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన రాష్ర్ట బీజేపీ అధినాయకత్వం ఢిల్లీలో మాత్రం మోకాలడ్డుతోంద ని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లో కాదు.. ఢిల్లీలో ధర్నా చే యాలన్నా రు. బీజేపీని ఒప్పించేలా ఒత్తిడి తీసుకురావాలని, కానీ ఆమె పొలిటికల్ డ్రామాలకు తెర లేపిందని ఆరోపించారు.
బీజేపీ నాయకులకు కులపిచ్చి : మంత్రి కొండా సురేఖ
బీజేపీ నాయకులకు నరనరాల్లో కులపి చ్చి పాతుకుపోయిందని మంత్రి కొండా సు రేఖ మండిపడ్డారు. పార్లమెంట్ కొత్త భవ నం ప్రారంభోత్సవానికి రాష్ర్టపతి ద్రౌపది ముర్మును వితంతు మహిళ అని మోడీ పిలవలేదని, రాష్ర్టపతి దళిత మహిళ కాబట్టి అ యోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సైతం పిలవలేదని ఆమె సంచలన ఆరోపణ లు చేశారు. ఎమ్మెల్సీ కవిత బీసీల కోసం ధ ర్నా చేయడం ఈ సంవత్సరానికే ఇది పెద్ద జోక్ అని అన్నారు. తన ఉనికి చాటు కునేందుకే బీసీ నినాదంతో కవిత మాట్లాడుతు న్నారని పేర్కొన్నారు. కవిత మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయ ని, దయచేసి బీసీల గురించి మాట్లాడవద్దని కవితకు హితవు పలికారు.
బీజేపీకి పుట్టగతులు ఉండవు : మంత్రి సీతక్క
సీఎం రేవంత్‌రెడ్డి బీసీ రిజర్వేషన్స్‌ను ముందుకు తీసుకువెళ్తున్నందుకు సంతోషం గా ఉందని మంత్రి సీతక్క అన్నారు. బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీలో మద్దతిచ్చిన బీజేపీ. పార్లమెంట్‌లో ఆమోదించేందుకు డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోసం బీజేపీ ఎప్పుడు పనిచేయదని విమర్శించారు. గల్లీలో బీజేపీ నేత లు ధర్నాలు చేయడం దేనికని, దమ్ముంటే ఢిల్లీలో ధర్నాలు చేయాలని, లేదంటే పుట్టగతులు ఉండవన్నారు. మోదీ పేరుకే బీసీ అ ని, ఆయన డీఎన్‌ఏలో బీసీ వ్యతిరేక భావజాలం ఉందన్నారు.
బీసీ బిడ్డలంటే అడుక్కోవాలా? : ఎమ్మెల్సీ విజయశాంతి
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్టే 42శాతం బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతామని ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. జంతర్‌మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల కోసం పెద్దఎత్తున పోరాటం చేస్తున్నామన్నారు. ఇ లా పోరాటం చేయడం రెండోసారి అని చె ప్పారు. బీసీ బిడ్డలు నడిరోడ్డు మీదకు వచ్చి రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతున్నారని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందన్నారు. కేం ద్రం బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను ఆమోదించే వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
పీడితుల తరఫున రేవంత్ పోరాటం: ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ, సుప్రియా సూలే
ముఖ్యమంత్రి అవుతానని రేవంత్‌రెడ్డి ఎప్పుడూ చెప్పలేదు.. కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మాత్రమే ఎన్సీపీ( ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే చెప్పారు. ఒక కార్యకర్త నుంచి సీంఎ వరకు రేవంత్‌రెడ్డి ఎదిగారని, పీడితులు, తాడితుల తరఫున ఆయన పోరాడుతున్నారని తెలి పారు. దేశంలో రిజర్వేషన్లు కల్పించిన అంబేడ్కర్, తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లకు కారణమైన కరుణానిధి పేర్ల పక్కన రేవంత్‌రెడ్డి పేరును సువర్ణాక్షరాలతో లిఖిస్తారన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్‌రెడ్డి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తాం : డీఎంకే ఎంపీ కనిమొళి
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులను తక్షణమే ఆమోదించాలి, తరతరాలుగా వెనుకబడిన వర్గాలకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని సరిచేయాల్సిన అవసం ఉందని డీఎంకే ఎంపీ కనిమొలి అన్నారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, ఈ రిజర్వేషన్లు దేశమంతా అమలు కావాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు డీఎంకే అండగా ఉంటుంన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు అన్ని స్థాయిల్లో మద్దతుగా నిలుస్తామని ఆమె ప్రకటించారు.
సీఎం రెడ్డి అయినా బీసీ బిల్లు ఆమోదించారు: మీనాక్షి నటరాజన్
ధర్నాలో ప్రసంగించిన వక్తలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు.. బీసీ రిజర్వేషన్ల బిల్లు పెంపునకు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని కొనియాడారు. వినోబా బావే భూదా న ఉద్యమం మొదలు పెట్టినప్పుడు తెలంగాణకు చెందిన ఓ రెడ్డి భూ స్వామి భూదానం చేసి పెద్ద మనస్సు చాటుకున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి.. రెడ్డి కులానికి చెందినప్పటికీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులు ఆమోదించారని, ఇది చరిత్రలో నిలిచిపోయే అంశమని ఆమె ప్రశం సించారు.
బీజేపీ నేతలు చేతగాని దద్దమ్మలు : పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
మతాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలవడం బీజేపీ నేతలకు అలవాటైందని, వాళ్లు చేతగాని దద్దమ్మలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా మతం కార్డును అడ్డుపెట్టుకుని బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలును డిమాండ్ చేస్తూ జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు.
ఎస్సీలు, ఎస్టీలు, బీసీల మద్దతు లేకుండా సికింద్రాబాద్‌లో నామినేషన్ వేయగలవా అని కిషన్‌రెడ్డిపై మండిపడ్డారు. బీసీల పేరిట గెలిచిన బండి సంజయ్, ఇప్పుడు కిషన్ రెడ్డికి వత్తాసు పలుకడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఓటు వేసిన బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారనిప్రశ్నించారు. ప్రధానికి కనువిప్పు కలిగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్యాబినెట్‌తోపాటు కాం గ్రెస్ శ్రేణులంతా మహాధర్నాలో పాల్గొన్నారని తెలిపారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఎంత దూరమైనా పోతామని ఆయన స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల కంటే బీసీ రిజర్వేషన్లే తమకు ముఖ్యమన్నారు. రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకోవాలంటే ద మ్ము, ధైర్యం అవసరం, అది ఒక రేవంత్‌రెడ్డికే ఉందని ప్రశంసించారు. రేవంత్ నిర్ణయం పట్ల ప్రధాని మోదీ పరేషాన్‌లో పడ్డారని ఎద్దేవా చేశారు.
రాహుల్‌గాంధీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి కులసర్వేకు శ్రీకారం చుట్టారని తెలిపారు. తెలంగాణలో బీసీ జనాభా 57 శాతంగా తేలిందన్నారు. ఈ కులసర్వే దేశానికి దిక్సూచిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. బీసీల వేదన కేంద్రానికి తెలియజేయడం కోసం ‘వన్ వాయిస్.. వన్ విజన్.. యునైటెడ్ బీసీ నినాదం’తో మహా ధర్నా నిర్వహించామన్నారు.
కేంద్రం.. ఓబీసీల కలను నెరవేర్చాలి: డిప్యూటీ సీఎం భట్టి
బీసీ బిల్లుకు కేంద్రం వెంటనే ఆమోదముద్ర వేసి దశాబ్దాల ఓబీసీల కలను నెరవే ర్చాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అ న్నారు. రాష్ర్ట ప్రభుత్వం చేయాల్సిన చట్టబద్ధమైన పనులు పూర్తిచేశామని, పార్లమెంట్లో చర్చ కోసం మన ఎంపీలు వాయిదా తీర్మా నం ఇచ్చారని తెలిపారు. తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శంగా ఉందన్నారు. బీసీ బిల్లు దేశానికి దశ, దిశను నిర్దేశిస్తుందని, దీంతో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ధర్నా వద్దకు వచ్చి మద్దతు తెలిపారని పేర్కొన్నారు.
అసెంబ్లీలో మద్దతు తెలిపిన బీజేపీ పార్లమెంట్‌లోను మద్దతు తెలియజేస్తుందని ఆశిస్తున్నామన్నారు. బీసీల రిజర్వేషన్ అంశం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సంబంధించి నది కాదని, రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినదని తెలిపారు. స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్ మించకుండా బీఆర్‌ఎస్ నేతలు పెట్టిన పరిమితిని తొలగించేందుకే రాష్ర్ట ప్రభుత్వం ముందస్తుగా ఆర్డినెన్స్ తెచ్చిందని వివరించారు. జంతర్ మంతర్ ధర్నా దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని, అందులో ఎలాంటి సందేహం లేదన్నా రు. రాహుల్‌గాంధీ ఇచ్చిన మాటను నేరవేర్చడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.