07-08-2025 01:27:18 AM
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట గత ప్రభుత్వం అనేక రకాలుగా రాష్ట్రానికి తీవ్రంగా నష్టం చేకూర్చింది. రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మించి నిధుల దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు, కనీసం ఆయకట్టు రైతాంగానికి నీరూ ఇవ్వలేదు. అవినీతి, రాష్ట్రం అప్పుల పాలు కావడం తప్పితే కాళేశ్వరం ప్రాజెక్టుతో చేకూరిన లాభమేమీ లేదు.
అయితే గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని పూడ్చడంతోపాటు ఆయకట్టుకు సాగునీరు అందించి ప్రజలకు మేలు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం పూనుకున్నట్టు సమాచారం. దీనికి తుమ్మిడిహట్టి వద్ద ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించడమే ప్రత్యామ్నాయమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజానీకానికి స్పష్టత వచ్చినట్టుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు ని రుపయోగంగా మారిన నేపథ్యంలో తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ని ర్మించే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రా రంభి ంచినట్టు తెలుస్తోంది. దీంతోపాటు క మిష న్ నివేదికలో కూడా తుమ్మిడిహట్టి వద్ద నీ టి లభ్యత కూడా ఉందని స్పష్టం చే యడ ంతో ప్రభుత్వ ఆలోచనకు ఊతమిచ్చే అ ంశంగా మారింది.
ప్రాణహిత-చేవెళ్లతో 2 లక్షల ఎకరాలకు నీరు..
తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చడంలో కేవలం స్వార్థ ప్ర యోజనమే తప్ప ప్రజా ప్రయోజనమేమీ లేదని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యం లో తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్ర భుత్వం లక్ష్యంగా పెట్టుకుని ముం దుకు సా గుతున్నది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజక్టును తి రిగి నిర్మించాలని నిర్ణయించింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభు త్వం నిర్మించిన కాలువలను వినియోగించి వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాలని యోచిస్తున్నది. దీని ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఆయకట్టుకు సాగునీరందించే అవకాశం ఉన్నది. వాస్తవానికి తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీ నీటి లభ్యత ఉందని గోదావ రి వాటర్ డిస్ప్యూట్ ట్రి బ్యునల్(జీడబ్ల్యూడీటీ) తీర్పు ఇచ్చినా గత ప్రభుత్వం పెడచె విన పెట్టింది.
గ్రావిటీ కెనాల్‌తో ఖర్చు ఆదా..
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను మరమ్మత్తు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చినా పంప్‌హౌస్‌ల ద్వారా ప్రభుత్వంపై అధిక భారం పడుతుంది. ప్రస్తుతం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు నీటిని ప ంపింగ్ చేయాలంటే 123 మీటర్లు ఎత్తిపోయాల్సి వస్తుంది. మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేస్తే పంపు హౌస్‌ల నిర్వహణ కోసం నెలకు సు మారు రూ. 1000 కోట్లకు వరకు విద్యుత్‌కు వినియోగించాల్సి ఉంటుంది.
మొత్తంగా ఏ టా మూడు బరాజ్‌ల వద్ద పంప్‌హౌస్‌ల ని ర్వహణ కోసం దాదాసు 12 వేల కోట్లు ఖ ర్చు చేయాలి. ఈ క్రమంలో తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మించి నీటిని తరలిస్తే ఈ స్థా యిలో ఖర్చు ఉండదు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి మొత్తం 110 కిలోమీటర్లు దూరం నీటిని తరలించాలి. అందులో భాగంగా ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే సుమారు 72 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ నిర్మించింది.
ఇక మిగి లిన 40 కిలోమీటర్ల కాలువను నిర్మిస్తే సరిపోతుంది. అ యితే తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీ టిని ఎత్తిపోసేందుకు మధ్యలో ఒక్క పంప్‌హౌస్ నిర్మిస్తే సరిపోతుందని సాగునీటి ని పుణులు చెబుతున్నారు. దీని ద్వారా కేవలం 19 మీటర్ల ఎత్తుకు నీటిని తరలిస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీరు చేరుకుంటుంది. ఈ పంప్‌హౌస్ నిర్వహణలో భాగంగా నెలకు 150 కోట్లు ఖర్చవుతుంది.
తుమ్మిడిహట్టి నుంచి పంపింగ్ చేసే ఎత్తుతో పోలిస్తే మేడిగడ్డ ను ంచి ఆరురెట్లు ఎత్తు ఎ క్కువగా పంపింగ్ చే యాలి. మేడిగడ్డ ను ంచి నీటిని పంపింగ్ చే యడం ద్వారా అనవసరమైన విద్యుత్ ఖ ర్చుతో నిధుల దు ర్వినియోగం జరుగుతున్న ది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చుతో నీ టిని పంపింగ్ చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రత్యామ్నాయంగా మారింది.