25-07-2025 01:43:30 AM
404 అడుగులకు చేరిన కిన్నెరసాని ప్రాజెక్ట్
భద్రాద్రి కొత్తగూడెం జూలై 24 (విజయ క్రాంతి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల కారణంగా ప్రాజెక్టులకు జలకల సం తరించుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలోని తాలుపేరు, కిన్నె రసాని, మూకమామిడి ప్రాజెక్టులకు వరదనేరు భారీగా చేరుకొంది. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. పర్ణశాల వద్ద సీతమ్మ వారి నార చీరలు నీటమునిగాయి.
మణుగూరు ప్రాంతం లోతట ప్రాం తాలన్నీ జలమయమయ్యాయి. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు సింగరేణి ప్రాంతంలో గల ఓపెన్ కాస్ట్ లో వర్షం నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడిం ది. కిన్నెరసాని 407 అడుగుల పూర్తి సామ ర్థ్యం ఉండగా గురువారం సాయంత్రం ఏడు గంటల వరకు 404 అడుగులకు చేరుకుంది.
ఇన్ఫ్లోస్ అధికంగా ఉండటంతో గురువా రం రాత్రి ఒక గేటుని ఎత్తి 1000 క్యూసెక్కు ల నీటిని బయటికి విడవనున్నట్లు జన్కో అధికారులు ప్రకటించారు. తాళ్లపేరు ప్రాజెక్టుకు పదివేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరడం తో గేట్లు ఎత్తి వకదనీటిని పంపుతున్నారు.
పర్ణశాలలో భారీ వర్షానికి నేత మునిగిన సీతమ్మ వారి మారచి చీరల ప్రాంతం
భద్రాచలం/దుమ్మగూడెం, జులై 24, (విజయ క్రాంతి):గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చతిస్గడ్ లోని అటవీ ప్రాంతం నుండి వచ్చే సీతమ్మ వాగు పొంగి ప్రవహించడం వల్ల భద్రాచలం ని యోజవర్గంలోని పాఠశాలలో గల సీతమ్మ వారి నార చీరల ప్రాంతం నేత మునిగింది. భద్రాచలం సందర్శించిన యాత్రికులు రా మ దర్శనం అనంతరం భద్రాచలానికి 30 కిలోమీటర్ల దూరంలో గల పర్ణశాలలోని రా ముడు తిరిగిన ప్రాంతాన్ని రామాలయాన్ని చివరికి సీతమ్మవారు చీరలు ఆరేసుకున్న నార చీరల ప్రాంతాన్ని అలాగే సూర్పనక్క చె ట్టుని వీక్షించడం జరుగుతుంది.
పర్ణశాల సం దర్శించిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించి సూర్పనకు చెట్టుకు రాలివేసి ప్రాంతాన్ని సందర్శించటం పరిపా టి.అయితే గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీ ఎత్తున వరద నీరు రావడంతో ఈ ప్రాంతం అంతా నీటి లో మునిగిపోయింది. దాంతో ఆ ప్రాంతానికి వెళ్లడానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు ప డే పరిస్థితి నెలకొంది.
పర్ణశాల రామాలయ ప్రాంతంలో ఉన్న సీతవాగు పొంగడంతో స్వామివారి నార చీరల ప్రాంతం సీతమ్మ వారి విగ్రహం సగం వరకు నీట మునిగింది. స్వామివారి సింహాసనం,నార చీరల ప్రాం తం పూర్తిగా నీట మునిగింది. సీతమ్మ విగ్ర హం సగం వరకు వరద నీటిలో మునిగి పో యింది.పర్ణశాల రామాలయానికి వచ్చిన భక్తులు నారచీరల ప్రాంతం చూసే అవకా శం లేకుండా పోయింది.