calender_icon.png 7 August, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాయతీ లేని ధర్నా

07-08-2025 01:44:33 AM

  1. దీక్షకు రాహుల్ ఎందుకు రాలేదు?
  2. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): జంతర్‌మంతర్‌లో ధర్నా పేరుతో రేవంత్ రెడ్డి నిర్వహించిన డ్రామా అట్లర్ ఫ్లాప్ అ యిందిన మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు కూతవేటు దూరంలో ఉండి రాహుల్‌గాంధీ రాలేదని ఎద్దేవా చేశారు. తమకు బీసీ కన్న బీహారే ముఖ్యమని మల్లిఖార్జున్ ఖర్గే రాలేదన్నారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ లో ఆయన పోస్టు చేశారు.

మీ ధర్నాలో నిజాయితీ లేదని, బీసీలకు 42శాతం కోటా అ మలు చేస్తారనే మాటలపై నమ్మకం రాహుల్‌గాంధీకి, ఖర్గేలతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా లేదని సుస్పష్టం అయిందన్నారు. తాము గుజరాత్, యూపీ, మహారా ష్ట్రలో అడగలేదని, తెలంగాణలోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అడుగుతున్నామని రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తే..

అదే సమయంలో రాహుల్‌గాంధీ ఈ పోరాటం తెలంగాణ కోసం కాదు, యావత్ దేశం కోసం చేస్తున్న పోరాటం అని ట్వీట్ చేస్తారని విమర్శించారు. ఒకే రోజు, ఒకే సమయంలో సీఎం రే వంత్‌రెడ్డి చెప్పిన మాటలకు, రాహుల్ గాంధీ చెప్పిన మాటలకే పొంతన లేదన్నా రు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ మీద కాం గ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో రెండు నాల్కల దోరణి చూస్తేనే అర్థం అవుతుందని  మండిపడ్డారు. 

మహిళా ఎమ్మెల్యేపై దౌర్జన్యం దుర్మార్గం

రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడమే సబిత ఇంద్రారెడ్డి చేసిన తప్పా అని  హరీశ్‌రావు విమర్శించారు. మంత్రి సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు వీధి రౌడీలుగా బెదిరింపులకు పాల్పడుతుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు వారితో కలిసి మహిళా ఎమ్మెల్యేపై దౌర్జన్యానికి పా ల్పడటం దుర్మార్గమన్నారు. ఈ మేరకు బుధవారం ఎక్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ, తెలంగాణ సీఎంఓలను ట్యాగ్ చేస్తూ పోస్టు చేశారు.

సబితా ఇంద్రారెడ్డిపై అనుచితంగా, అమర్యాదగా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోంమంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. కాంగ్రెస్ తాటాకు చప్పళ్లకు, రౌడీ మూకల దాడులకు బీఆర్‌ఎస్ భయడపడదని స్పష్టం చేశారు. మిమ్మల్ని నిలదీ స్తూనే ఉంటామని, ప్రజాక్షేత్రంలో మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని ఆయన చెప్పారు.