9 March, 2026 | 11:23 PM

గిరి ప్రదక్షిణలో నృత్య ప్రదర్శన

09-03-2026 02:19 AM

యాదగిరిగుట్టలో 12 ఏళ్ల వైష్ణోదేవి కూచిపూడి ప్రదర్శన

హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): కళ, సంస్కృతి, ఆధ్యాత్మికతను సమ్మిళితం చేస్తూ హైదరాబాద్‌ఖు చెందిన 12 ఏళ్ల కూచిపూడి నర్తకి పి శ్రీ వైష్ణో దేవి ఆదివారం యా దగిరి గుట్టలో పవిత్ర గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రత్యేకమైన కూచిపూడి నృత్య ప్రద ర్శన అందించారు. తెలంగాణలో ఇదే తొలిసారి ఈ విధమైన వినూత్న కార్యక్రమం నిర్వ హించబడింది. స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు.

ఈ సందర్భంగా వైష్ణో దేవి మొత్తం 3 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గమంతా కూచిపూ డి నృత్యం చేస్తూ భక్తులను ఆకట్టుకుంది. ప్రదక్షిణ పూర్తయ్యాక పలువురు భక్తులు ఆమెతో కలిసి ఫోటోలు తీసుకుని అభినందించారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలయ ఈఓ, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. ఈ వినూత్న కార్య క్రమాన్ని ఎమ్మెల్యే బీర్ల ఇలయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో మరో ప్రత్యేక ఆకర్షణగా వైష్ణో దేవి కుటుంబ సభ్యులు కూ డా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. 86 ఏళ్ల వయస్సు గల ఆమె ముత్తాతమ్మలు కూడా గిరి ప్రదక్షిణ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండి జీవితాన్ని సంతో షంగా నడిపించుకోవాలని సందేశం ఇచ్చా రు.

ఈ కూచిపూడి నృత్య ప్రదర్శన జ్యోతి కళాక్షేత్రం స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వైష్ణో దేవి గత ఐదేళ్లుగా తన గురువు జ్యోతిరెడ్డి మార్గదర్శకత్వంలో కూచిపూడి నృత్యాన్ని అభ్యసిస్తోంది. ఈ నృత్య ప్రదర్శన వైష్ణో దేవికి ఒక ఆధ్యాత్మిక సమర్పణగా నిలిచింది. తన తాతమ్మల 50వ వివా హ వార్షికోత్సవం సందర్భంగా వారి ఆరో గ్యం, ఆనందం కోసం స్వామివారి ఆశీర్వాదాలు కోరుతూ ఈ గిరి ప్రదక్షిణలో నృత్యం చేసింది. గిరి ప్రదక్షిణ సమయంలో నృత్యం చేయడం చాలా ప్రత్యేకమైన, ఆధ్యాత్మిక అనుభూతి ఇచ్చిందని పీ శ్రీవైష్ణోదేవి చెప్పా రు. ఆమె తల్లి పీ వినయాదేవి మాట్లాడుతూ.. ఇంత చిన్నవయస్సులోనే వైష్ణోదేవి తన కళను భక్తితో సమర్పించడం చూసి తల్లిదండ్రులుగా ఆనందంగా ఉన్నదన్నారు.