శిల్పారామంలో నాట్య ప్రదర్శనలు రమణీయం
31-08-2026 | 12:00am
శేరిలింగంపల్లి, ఆగస్టు 30 (విజయక్రాం తి): మాదాపూర్ శిల్పారామంలో ఆదివారం వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు జరిగా యి. భరతనాట్యంలో శృతి స్వర్ణకార, వేదప్రియలు జతిస్వరం, అష్టకం, కీర్తనం, తిల్లాన అంశాలతో ప్రేక్షకులను అలరించారు.
పంచమవేద నాట్య నిలయం గురువు కనకదుర్గ శిష్యులు కూచిపూడిలో ఝేమ్ ఝేమ్ తనన, బ్రహ్మాంజలి, శివ పంచాక్షరి, అదిగో అల్లదిగో, రుక్మిణి ప్రవేశం, బాలగోపాల తరంగం ప్రదర్శించారు.శారదవల్లి, అభిజ్ఞ, పర్ణిక, తేజస్విని, దీత్య, అపేక్ష, కృతికతో పాటు ఇతరులు పాల్గొని మెప్పు పొందారు.






