10 August, 2026 | 3:07 AM

ప్రమాదకరంగా మ్యాన్‌హోల్స్

10-08-2026 01:59 AM

తరచూ ప్రమాదాలు.. మరమ్మతులు చేయాలని డిమాండ్

జవహర్ నగర్, ఆగస్టు 9 (విజయక్రాంతి): దమ్మాయిగూడ ప్రాంతంలో  ప్రధాన రహదారిపై డ్రైనేజీ మ్యాన్హోల్ ప్రమాదకరంగా తయారయ్యాయి. మ్యాన్ హోల్స్ చుట్టూ రోడ్డు కుంగిపోవడం, భారీ రంధ్రాలు పడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేగాక భారీ వర్షాల కురిసిన సమయంలో  పూర్తిగా నీటితో నిండిపోవడంతో అది కనిపించక, ద్విచక్ర వాహనదారులు,

పాదచారులు ప్రమాదానికి గురవుతున్నారు.  ప్రతిరోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇదే మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు... ప్రాణనష్టం జరగకముందే చర్యలు తీసుకోవాలి‘ అని స్థానికులు కోరుతున్నారు. వెంటనే గుంతను పూడ్చి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి రహదారిని సురక్షితంగా మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.